Renu Desai: రామ్ చరణ్ ‘రైమ్’కు రేణు దేశాయ్ థ్యాంక్స్ - ఎందుకో తెలుసా?
Ram Charan Rhyme: రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ‘రైమ్’ అనే పెంపుడు కుక్కను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ‘రైమ్’కు రేణు దేశాయ్ ఇప్పుడు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు.

Ram Charan Upasana Pet Rhyme: ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ జంతువుల సంరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. తన కూతురు ఆద్య పేరు మీద ‘శ్రీ ఆద్య’ అనే ఎన్జీవో, యానిమల్ షెల్టర్‌ను కూడా రేణు దేశాయ్ ప్రారంభించారు. కుక్కలు, పిల్లులు, ఇతర సాధు జంతువులను కాపాడి, వాటిని పెంచడం కోసం ఈ సెంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఉపాసన కొణిదెల, రామ్ చరణ్ ‘రైమ్’ నుంచి స్పెషల్ డొనేషన్...
రామ్ చరణ్ (Global Star Ram Charan), ఉపాసన (Upasana Kamineni Konidela) తాము పెంచుకునే ‘రైమ్’ పేరు మీద ఈ ఎన్జీవోకు ప్రత్యేకమైన డొనేషన్ చేశారు. ఈ డొనేషన్ ద్వారా యానిమల్ షెల్టర్ నిర్వహణలో రోజూ ఉపయోగపడేలా ఒక ఆంబులెన్స్‌ను కొనుగోలు చేశారు. రేణు దేశాయ్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ఈ డొనేషన్ ఎన్నో జంతువుల జీవితాల మీద ప్రభావం చూపిస్తుందని అన్నారు. జంతువుల సంరక్షణ కోసం రేణు దేశాయ్ చూపిస్తున్న డెడికేషన్‌ను నెటిజన్ల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు పెట్స్ కి సంబంధించి పోస్ట్‌లు పెడుతుంటారు. అందులో భాగంగానే గతంలో ఆమె ఒక బ్యాంక్ అకౌంట్, స్కానర్ ని పోస్ట్ చేసి డబ్బులు సాయం అడిగారు. అందరూ ఆ సమయంలో రేణు దేశాయ్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యిందని అనుకున్నారు. కానీ ఆ పోస్టు పెట్టింది తానేనని, తను పెట్స్ కి సాయం చేయడం కోసం తీసి పెట్టిన డబ్బుల లిమిట్ మించి పోవడం వల్ల అలా పెట్టాల్సి వచ్చిందంటూ తర్వాత క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్.
Also Read: ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

