Akira Nandan: 'నో ప్లాస్టిక్, నో డ్యామేజ్' అకీరా ఫొటో షేర్ చేస్తూ స్టోరీ చెప్పిన రేణుదేశాయ్!
ఆరున్నర అడుగుల అకీరాను చూసుకొని మురిసిపోతుంటారు అభిమానులు. రేణుదేశాయ్ కి కూడా కొడుకు అంటే పిచ్చి ప్రేమ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కు అభిమానుల్లో క్రేజ్ మాములుగా లేదు. అకీరా సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించడు. అతడికి సంబంధించిన విషయాలు కూడా చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. అసలు అకీరాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందో.. లేదో.. హీరోగా ఎంట్రీ ఇస్తాడో.. లేదో అనే విషయాల్లో క్లారిటీ లేనప్పటికీ.. అభిమానులు మాత్రం ఆయన్ను జూనియర్ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అకీరాకు సంబంధించిన ఫోటోలేమైనా బయటకు వస్తే ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తుంటారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
ఆరున్నర అడుగుల అకీరాను చూసుకొని మురిసిపోతుంటారు అభిమానులు. రేణుదేశాయ్ కి కూడా కొడుకు అంటే పిచ్చి ప్రేమ. అప్పుడప్పుడు అకీరాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కొడుకుపై ప్రేమను చాటుకుంటుంది. అకీరాకు బుక్స్ చదవడం, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని ఇప్పటికే రేణుదేశాయ్ ఓ సందర్భంలో చెప్పింది. తాజాగా అకీరాకు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసింది రేణు దేశాయ్.
అందులో అకిరా కొబ్బరిబోండాం తాగుతూ కనిపించాడు. ఈ ఫొటోను షేర్ చేసిన రేణు.. 'కొబ్బరిబోండాం తాగడానికి ఇదే బెస్ట్ వే.. స్ట్రా లేదు, ప్లాస్టిక్ లేదు, ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి డ్యామేజ్ జరగదు' అని చెప్పింది. మరో ఫొటోలో ఉన్న లేడీ గురించి మాట్లాడుతూ.. 'ఈషా ఫౌండేషన్ నుంచి కోయింబత్తూర్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే దారిలో ఈ మహిళ కొబ్బరిబోండాలు అమ్ముతోంది. ఆమె ఫొటో తీసుకున్న సమయంలో 'మేం ఆనందంగా ఉండడానికి డబ్బు మీద ఆధారపడాల్సిన అవసరం లేదని' చెప్పిందంటూ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.
Also Read: 'నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ - నా జీవో గాడ్స్ ఆర్డర్' బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే!
Also Read: నయన్-విఘ్నేష్ ల మంచి మనసు, వేలాది పేద పిల్లలకు విందు భోజనం
View this post on Instagram