X

Nenena Trailer: ‘నేనేనా’ ట్రైలర్.. 4 రోజుల్లో మనిషి అస్థిపంజరంలా ఎలా మారిపోతాడు?

రెజీనా నటించిన ‘నేనేనా’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల చేతుల మీదుగా తెలుగు, తమిళ ట్రైలర్లు ఒకేసారి విడుదలయ్యాయి.

FOLLOW US: 

టాలీవుడ్‌లో దాదాపు కనుమరుగైపోయిన రెజీనా కసండ్ర.. నేనున్నానని చెబుతూ.. ‘నేనే నా?!’ అనే థ్రిల్లర్ చిత్రంతో వచ్చేస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం టాలీవుడ్, కోలివుడ్ ప్రముఖుల ద్వారా ఒకేసారి తెలుగు, తమిళ ట్రైలర్లను విడుదల చేయించారు. ఈ ట్రైలర్ చూస్తే రెజినా మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెజినాకు హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె ఈ చిత్రంపై భారీ అంచనాలే పెంచుకుంది. ఈ చిత్రంతో మరోసారి తన లక్ పరీక్షించుకోవాలని రెజీనా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నయనతార విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటోంది. దీంతో రెజీనా కూడా ఆమె బాటలోనే ప్రయాణించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఎవరు’ సినిమా ద్వారా రెజినా మంచి హిట్ సాధించినా.. అవకాశాలు మాత్రం రాలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘నేనే నా?!’ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేస్తోంది. 
 
మిస్టరీ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ‘నేనే నా?!’ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్‌ నటించిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో ఇప్పటికే కార్తిక్ మంచి దర్శకుడుగా నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో రెజినా నటిస్తున్న ‘నేనే నా?!’ చిత్రంపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలే ఉన్నాయి. తమిళంలో ఈ చిత్రాన్ని ‘సూర్పనగై’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. యాపిల్ ట్రీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సామ్ సి.ఎస్. సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక విదేశీయుడి హత్యతో మొదలవుతుంది. అతడిని ఎవరు హత్య చేశారనే మిస్టరీని చేధించే నిమిత్తం పోలీసులు.. ఆర్కియాల‌జిస్ట్‌గా పనిచేస్తున్న రెజీనా సాయం కోరతారు. అయితే, ఆ హత్యల వెనుక వందేళ్ల కిందట జరిగిన ఓ ఘటనే కారణమని తెలుస్తుంది. అప్పట్లో ఏం జరిగింది? ఆ హత్యలకు గల కారణాలు ఏమిటీ? సూర్పుణక ఎవరు అనేది తెరపైనే చూడాలి. ఓవరాల్‌గా చూస్తే.. ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసేలాగే ఉంది. అయితే, కాస్త ‘భాగమతి’, ‘అరుంధతి’ తరహాలోనే ఈ చిత్రం ఉంటుందా అనిపిస్తోంది. 

ట్రైలర్:

కొద్ది రోజుల కిందట హీరో వరుణ్ తేజ్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. అందులో రెజినా.. ముక్కు పుడకతో మహారాణిలా ఇనుప చువ్వల మధ్య బందీగా ఉన్నట్లు కనిపించింది. ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా క‌న‌ప‌డ‌తారు. అంటే రెజినా ఇందులో రెండు పాత్రల్లో కనిపించున్నట్లు అర్థమవుతోంది. మరో  పోస్టర్‌లో రెజీనా ఓ అస్థిపంజరాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఉంది. చూస్తుంటే.. ఆ అస్థిపంజరం వెనుక మిస్టరీ ఏదో దాగుని ఉంటుందనిపిస్తోంది. మొత్తానికి ఈ పోస్టర్లు.. ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని, ఇందుకు రెజినా ప్రత్యేకంగా శిక్షణ పొందిందని నిర్మాతలు చెప్పారు.  

Also Read: ‘శ్రీకాంత్ జాగ్రత్త.. నా కళ్ల ముందు హీరో అయ్యావు’.. నరేష్ మండిపాటు

Tags: Nenena Trailer Nenena Movie Trailer Nenena Nenena Movie Reginaa Cassandraa Regina నేనేనా

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP DGP Gautam Sawang: గంజాయి ఏపీకి కొత్త కాదు... డ్రగ్స్ వ్యవహరంలో రాజకీయం వద్దు... డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు

AP DGP Gautam Sawang: గంజాయి ఏపీకి కొత్త కాదు... డ్రగ్స్ వ్యవహరంలో రాజకీయం వద్దు... డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు

Pattabhi : కుటుంబం కోసం బయటకు వెళ్లా.. త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !

Pattabhi :  కుటుంబం కోసం బయటకు వెళ్లా..  త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Bank Holidays in November 2021: నవంబర్లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే నగదుకు ఇబ్బందులు ఉండవు

Bank Holidays in November 2021: నవంబర్లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే నగదుకు ఇబ్బందులు ఉండవు