By: ABP Desam | Updated at : 08 Feb 2022 12:36 PM (IST)
'లైగర్' డిజిటల్ రైట్స్ కి క్రేజీ డీల్
యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడుతున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ డీల్ ఆఫర్ చేశారట.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టింది. భారీ మొత్తం చెల్లించి 'పుష్ప' సినిమా హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా రైట్స్ కోసం ప్రయత్నిస్తుంది. 'లైగర్' సినిమా అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ.60 కోట్లు ఆఫర్ చేసిందట అమెజాన్. ఈ క్రేజీ డీల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లేనని సమాచారం.
విజయ్ దేవరకొండ సినిమాకి ఈ రేంజ్ లో డీల్ రావడమంటే మాములు విషయం కాదు. తొలిసారి అతడు పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
THE ACTION👊 & THE MADNESS🤙🏻on sets comes to an end🎬
Team #LIGER wrapped up the entire shoot &
Buckling up to unleash the Beast on AUG 25th 2022🔥@TheDeverakonda @MikeTyson #PuriJagannadh @karanjohar @ananyapandayy @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/rBK6OjNwO6 — Puri Connects (@PuriConnects) February 6, 2022
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Urfi Javed: ఉర్ఫీ జావెద్కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ
Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ
Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే
Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?
Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల