అన్వేషించండి

RC15: చరణ్, శంకర్ సినిమా - టార్గెట్ దసరా 2023!

2023 వేసవికి రామ్ చరణ్, శంకర్ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొదట అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ శంకర్ 'ఇండియన్2' సినిమాను టేకప్ చేయడంతో.. చరణ్ సినిమా ఆలస్యమవుతుంది. 

దీంతో అనుకున్నట్లుగా షెడ్యూల్స్ పూర్తి కావడం లేదు. ముందుగా 2023 వేసవికి సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో శంకర్ ఆగస్టులో సినిమాను రిలీజ్ చేద్దామని దిల్ రాజుకి చెప్పారట. కానీ దిల్ రాజు మాత్రం 2023 దసరాకి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దసరా సెలవులను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు శంకర్. అంటే చరణ్ సినిమా ఇప్పట్లో రాదన్నమాట. 

చరణ్ భార్యగా అంజలి:
రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అందులో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రోల్ కమల్ హాసన్ 'భారతీయుడు'లో ఓల్డ్ క్యారెక్టర్‌ను పోలి ఉంటుంది. ఆల్రెడీ సైకిల్ తొక్కే చరణ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. రీసెంట్ గా మరికొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. అవి చూస్తే... RC15లో చరణ్ భార్యగా అంజలి నటిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరి ఫ్యామిలీ ఫోటో లీక్ అయింది. అందులో ఓ బాబు కూడా ఉన్నాడు. రామ్ చరణ్, అంజలి జంటగా నటిస్తుండగా... ఆ జంటకు జన్మించిన బాబు యంగ్ రామ్ చరణ్ అన్నమాట.
 
యంగ్ రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావడం, ప్రభుత్వ అధికారి అయిన తర్వాత అతను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వంటివి కథగా తెలుస్తోంది. మరో హీరోయిన్ కియారా అద్వానీ కూడా ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఆమెకు, చరణ్‌కు మధ్య రొమాంటిక్ ట్రాక్ మెచ్యూర్డ్‌గా ఉంటుందట.

శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

RC16 కన్ఫర్మ్ అయినట్లేనా?
కొన్ని నెలలుగా చరణ్ ను కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. 'మఫ్తి' అనే సినిమాతో కన్నడలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు నర్తన్. చాలా కాలంగా ఆయన చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్ గా కథ సెట్ అవ్వడంతో చరణ్ కి వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో.. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫైనల్ నేరేషన్ ఇచ్చారు నర్తన్. కథ ఇంప్రెసివ్ గా అనిపించడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది.

Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today October 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు నిజం చెప్పిన నందు – మళ్లీ చక్రం తిప్పుతున్న రేఖ
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు నిజం చెప్పిన నందు – మళ్లీ చక్రం తిప్పుతున్న రేఖ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కఠిన దీక్షని సహస్ర సిద్ధం! విహారిని చంపడానికి అంబిక, సుభాస్‌ ప్రయత్నాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కఠిన దీక్షని సహస్ర సిద్ధం! విహారిని చంపడానికి అంబిక, సుభాస్‌ ప్రయత్నాలు!
Cult Review - కల్ట్ రివ్యూ: స్క్విడ్ గేమ్ టైపులో... దర్శకుడిగా, హీరోగా విశ్వక్ సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
కల్ట్ రివ్యూ: స్క్విడ్ గేమ్ టైపులో... దర్శకుడిగా, హీరోగా విశ్వక్ సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget