Raviteja: 'ఖిలాడి' వాయిదా పడుతుందా? ఆ రెండు డేట్లపై రవితేజ కన్ను
ఈ ఏడాది 'ఖిలాడి' సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు రవితేజ. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. 2021లో 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ.. ఈ ఏడాది 'ఖిలాడి' సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రలో యాభై శాతం ఆక్యుపెన్సీ ఇంకా అలానే ఉంది. పైగా సెకండ్ షోకి అవకాశం లేదు. కాబట్టి ఫిబ్రవరి 11న విడుదలవుతుందా..?లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే దర్శకనిర్మాతలు మాత్రం చెప్పిన టైంకి రావాలనుకుంటున్నారు.
రవితేజ మాత్రం పరిస్థితులు కాస్త సెట్ అయ్యాక వస్తే మంచిదనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఒక వారం రోజులు వెనక్కి తగ్గి ఫిబ్రవరి 18న సినిమా విడుదల చేయాలనేది రవితేజ ప్లాన్. అప్పటికి 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ దొరుకుతుందని టాక్. దీంతో రవితేజ డైలమాలో పడ్డారట. వంద శాతం ఆక్యుపెన్సీతో ఫిబ్రవరి 18న రావడం కరెక్ట్ అని అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాతో పాటు రవితేజ మూడు, నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' సినిమాలో నటించనున్నారు. అలానే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమా సెట్స్ పై ఉంది.
View this post on Instagram