News
News
X

Ravi Teja: ఏడాదికి మూడు సినిమాలు - మరి కంటెంట్ తో పనిలేదా?

రవితేజ ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేయాలనే పాలసీ పెట్టుకున్నారు. 

FOLLOW US: 
 
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(Raviteja) హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. 'క్రాక్' సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారాయన. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' అనే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండూ కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు 'ధమాకా' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అంటే ఏడాదికి మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నారన్నమాట. 

అలానే వచ్చే ఏడాది కూడా మరో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారట. 2023కోసం 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' లాంటి సినిమాలను రెడీ చేస్తున్నారు. అలానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'వాల్తేర్ వీరయ్య' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు రవితేజ. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు రవితేజ.

ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ను కూడా ఒప్పుకుంటున్నారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేలా చూసుకుంటున్నారు ఈ మాస్ హీరో. అంతవరకు బాగానే ఉంది కానీ మరి కంటెంట్ సంగతి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచనతో స్క్రిప్ట్ మీద ఫోకస్ చేయడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే రవితేజ నుంచి ఈ మధ్యకాలంలో ఒక్క సరైన సినిమా కూడా రాలేదని మాట్లాడుకుంటున్నారు. ఏడాదికి మూడు సినిమాలు అనే పాలసీ పెట్టుకోవడం బాగానే ఉంది కానీ కంటెంట్ మీద కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని సజెషన్స్ ఇస్తున్నారు నెటిజన్లు. తన నుంచి రాబోయే సినిమాలతోనైనా రవితేజ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి! 

రవితేజ 'ఈగల్':
రీసెంట్ గా రవితేజ మరో సినిమా ఒప్పుకున్నారు. అదే 'ఈగల్'. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. దీనికి 'ఈగల్' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

News Reels

అదేంటంటే.. ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి ఫ్రీమేక్ అని టాక్. హాలీవుడ్ లో 'జాన్ విక్' సినిమాలు ఎంత పాపులరో తెలిసిందే. 2014లో వచ్చిన 'జాన్ విక్' కథను అడాప్ట్ చేసుకొని రవితేజతో తీయాలనుకుంటున్నారు కార్తిక్ ఘట్టమనేని. 'జాన్ విక్' సినిమాలకు సంబంధించి రీమేక్ రైట్స్ అమ్మే ఛాన్స్ లేదు. కాబట్టి రవితేజ సినిమా ఫ్రీమేక్ అనే చెప్పుకోవాలి. తెలుగుకి తగ్గట్లు కథలో మార్పులు, చేర్పులు చేసి.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాలనేది దర్శకుడి ప్లాన్. 

దర్శకుడు రెడీ చేసుకున్న ఎడాప్షన్ స్టోరీ రవితేజకి నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి పోలాండ్ లో సినిమా షూటింగ్ ను నిర్వహించనున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో కనిపించనుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ 'కార్తికేయ2'తో హిట్ అందుకుంది. రవితేజ సినిమా కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచిందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాను నిర్మించనున్నారు. 

Also Read : హిందీలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ - మరో 600 స్క్రీన్లలో...

Also Read : ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ

Published at : 08 Oct 2022 03:35 PM (IST) Tags: Ravi Teja Ravi Teja new policy Ravi Teja movies

సంబంధిత కథనాలు

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్