ఓటీటీలోకి నేరుగా రవిబాబు ‘అసలు’ సినిమా, మళ్లీ ఆమెతోనేనా?
‘అనసూయ’, ‘అవును’ వంటి సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకున్న రవిబాబు మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘అసలు’ అనే టైటిల్ తో మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు రవిబాబు.

టాలీవుడ్ లో నటుడు, దర్శకుడు రవిబాబుకు మంచి ఫాలోయింగ్ ఉంది. విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా దర్శకుడిగానూ తన మార్క్ ను చూపించాడు. కామెడీ డ్రామా, క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్ సినిమాలు తీయడంలో రవిబాబుకు మంచి గుర్తింపు ఉంది. ‘అనసూయ’, ‘అవును’ వంటి సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకున్న రవిబాబు మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘అసలు’ అనే టైటిల్ తో మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు రవిబాబు. ఈ సినిమాలో ‘అవును’ సినిమాలో నటించిన నటి పూర్ణ మరోసారి రవిబాబు దర్శకత్వంలో నటించింది. ఈ ‘అసలు’ సినిమాను డైరెక్ట్ ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా విడుదల తేదీను ప్రకటించారు మేకర్స్.
కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రానిస్తున్నారు రవిబాబు. తన మొదటి సినిమా అల్లరి నరేష్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘అల్లరి’ సినిమాను తీశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాతే నరేష్ కు అల్లరి నరేష్ అని పేరు వచ్చింది. ఈ సినిమాల తర్వాత ‘అమ్మాయిలు అబ్బాయిలు’, ‘సోగ్గాడు’, ‘పార్టీ’ సినిమాలు చేశారు. ఈ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. తర్వాత భూమిక లీడ్ రోల్ లో ‘అనసూయ’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. తర్వాత కొన్ని కొన్ని లవ్ స్టోరీలు సినిమాలు చేసినా అవి యావరేజ్ గా నిలిచాయి. దీంతో మళ్లీ ‘అమరావతి’, ‘అవును 1, 2’ సినిమాలు తీశాడు. ‘అవును’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే మరోసారి అదే సబ్జెక్ట్ ను నమ్ముకున్నాడు రవిబాబు.
ఇక ఈ సినిమాలో రెండు విషయాలు కామన్ గా కనిపిస్తున్నాయి. ఒకటి సినిమాలో నటిస్తోన్న నటి పూర్ణ. ఈమె గతంలో కూడా రవిబాబు తీసిన ‘అవును’ సిరీస్ సినిమాల్లో నటించింది. మరోసారి ఈ థ్రిల్లర్ సినిమాలో నటించింది. అలాగే రవిబాబు మొదటనుంచీ తీస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు అన్నీ ‘అ’ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. ‘అల్లరి’, ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును 1,2’ ఇలా.. ఇప్పుడు ఈ సినిమాకి కూడా మొదటి అక్షరం అ వచ్చేలా ‘అసలు’ అని పేరు పెట్టారు. ఇక ఈ మూవీను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ఏప్రిల్ 5 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకూ ప్రేక్షకులను భయపెడుతుందో చూడాలి.
Asalu kadha enti? 🧐 Asalu cinema deni gurinchi? 🤔 Asalu ekada chudali? 👀
— ETV Win (@ETV__Win) March 14, 2023
Inkekkada #ETVWinLo!🤩 #Asalu a Film by Ravi Babu premiers 5th April only on #ETVWin#ETVWinOriginals #ETVWinLoChudandi pic.twitter.com/eDh2lPsT3b
ఇక నటి పూర్ణ కూడా ఇటు సినిమాలు అటు టీవీ షో లలో చేస్తూ బిజీగానే ఉంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్ లకు దూరంగా ఉంటోంది. ఇటీవలే ఆమెకు సీమంతం వేడుక ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీని 2022 అక్టోబర్ 25 న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















