Rashmika Vijay Devarakonda : రష్మిక - విజయ్ దేవరకొండ - న్యూ ఇయర్ కహానీ ఏంటి?
విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. రష్మిక కూడా! పావు గంట వ్యవధిలో ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దాంతో ప్రేక్షకులకు కొత్త సందేహాలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు ఏం పోస్ట్ చేసినా ప్రేక్షకులు వెంటనే చూస్తారు. న్యూ ఇయర్, న్యూ మంత్, న్యూ డే... ఆడియన్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ పోస్ట్ చేసిన పదిహేను నిమిషాల తర్వాత నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) 'హలో 2023' అని సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేశారు. దాంతో ప్రేక్షకులకు కొత్త డౌట్స్ స్టార్ట్ అయ్యాయి?
రష్మికా మందన్నా...
విజయ్ దేవరకొండ...
ఇప్పుడు ఎక్కడున్నారు?
విజయ్, రష్మిక ఫోటోలు చూసిన తర్వాత ప్రేక్షకుల మదిలో మెదిలిన మొదటి ప్రశ్న... 'ఇప్పుడు వీళ్ళు ఇద్దరూ ఎక్కడ ఉన్నారు?' అని! ఎందుకంటే... విజయ్ దేవరకొండ ఫోటో చూస్తే సముద్ర తీరంలో రిసార్ట్ దగ్గర స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్నట్టు అర్థం అవుతోంది. రష్మికా మందన్నా కూడా ఏదో రిసార్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల, ఇద్దరూ ఓకే చోటు ఉన్నారని సందేహిస్తున్నారు. అయితే, గత ఏడాది అక్టోబర్ నెలలో ఇద్దరూ మాల్దీవులు వెళ్ళినట్టు వార్తలు వచ్చాయిఙల. అప్పుడు దిగిన ఫోటోలు ఇప్పుడు పోస్ట్ చేశారేమో అని డౌట్.
View this post on Instagram
న్యూ ఇయర్... కలిసే
సెలబ్రేట్ చేసుకున్నారా?
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక్కొక్కరూ ఒక్కో చోటు సెలబ్రేట్ చేసుకున్నారు. మరి, విజయ్ దేవరకొండ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు? రష్మిక ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే... కలిసి సెలబ్రేట్ చేసుకున్నారని ఫిల్మ్ నగర్ గుసగుస.
View this post on Instagram
టైమ్ లేదు... ప్రేమ ఎక్కడ?
రష్మికను అభిమానులు, ప్రేక్షకులు ముద్దుగా 'నేషనల్ క్రష్' అంటున్నారు. మరి, ఆమెకు ఎవరిపై క్రష్ ఉంది? ఆమె జీవితంలో ప్రేమకు చోటు ఉందా? హిందీ సినిమా 'గుడ్ బై' ప్రమోషన్స్‌లో రష్మికకు ఎదురైన ప్రశ్న. అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పారో తెలుసా?
''నువ్వు మాకు అందుబాటులో ఉండటం లేదు' అని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆల్రెడీ నాతో ఎప్పుడూ చెబుతూ ఉంటారు. రిలేషన్షిప్‌లో ఉన్నప్పుడు మనం చాలా టైమ్ ఇవ్వాలి. చాలా ఓర్పుతో ఉండాలి. బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం సినిమాలతో నేను చాలా బిజీగా ఉన్నాను. నా కోసం అస్సలు టైమ్ ఉండటం లేదు. రాబోయే రోజుల్లో ఏదైనా ఉంటే చెబుతా'' అని రష్మిక పేర్కొన్నారు.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ - NTR 30 విడుదల ఎప్పుడో చెప్పేశారోచ్!
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, వాళ్ళు ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. గత ఏడాది ప్రేమ పుకార్ల గురించి రష్మిక స్పందించారు కూడా! ''మేమిద్దరం (విజయ్ దేవరకొండ, రష్మిక) మా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో భారీ హిట్ సినిమాలు చేశాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా చేశారు. నేను స్ట్రెయిట్ హిందీ సినిమా చేశా. హిందీలో నాకు ఇది తొలి సినిమా. మా ఇద్దరి కెరీర్స్ చాలా డిఫరెంట్. 'గుడ్ బై' సినిమా రెండేళ్ల క్రితం విడుదల కావాలి. కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. 'లైగర్' విడుదల కూడా కరోనా కారణంగా కొన్ని రోజులు ఆలస్యంగా వచ్చింది. ఇది యాదృశ్చికం తప్ప... అనుకుని చేసినది కాదు. మేం ఒకరి కోసం మరొకరం మాట్లాడుకోవడం ఉండదు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఏవైనా అడగాలంటే... అతడిని అడుగుతాను. కానీ, మా దారులు వేర్వేరు'' అని రష్మిక వివరించారు.
రూమర్స్ గురించి డిస్కషన్ వస్తుందా?
విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్షిప్ గురించి డిస్కషన్ జరుగుతోంది. సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అటువంటి వీడియోస్ కొన్ని తాను చూశానని రష్మిక తెలిపారు. అవి క్యూట్‌గా ఉన్నాయని, అయితే వాటి గురించి ఎప్పుడూ విజయ్ దేవరకొండతో డిస్కస్ చేయలేదన్నారు. తమది పదిహేను మంది సభ్యులతో కూడిన గ్యాంగ్ అని, అందరం కలిసినప్పుడు బోర్డు గేమ్స్ వంటివి ఆడతామని రష్మిక పేర్కొన్నారు.