Rashmika Mandanna: ఆ ముద్దు సీన్‌పై ట్రోల్స్, వెక్కి వెక్కి ఏడ్చాను: రష్మిక మందన్నా
విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్‌పై నెటిజన్లు ఒకప్పుడు ఓరేంజ్‌లో ట్రోల్ చేశారు. తాజాగా ఈ ట్రోల్స్ పై రష్మిక స్పందించింది.
రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రేక్షకులు ఈమెను ఎంతగానో ఇష్టపడతారు. కానీ, ఒకప్పుడు ఈ హీరోయిన్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు దిగారు. వాటిని తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చానని వెల్లడించింది ఈ కన్నడ సోయడం. 2019లో ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేసింది. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించింది. ఇందులో విజయ్, రష్మిక మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఈ సీన్ పై నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. వారాల పాటు ఈ ట్రోలింగ్ కొనసాగింది. తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించింది రష్మిక. ఈ ఎపిసోడ్ తన కెరీర్ లో అత్యంత బాధాకరమైనదని వెల్లడించింది.
భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా తెలుగు రొమాంటిక్ యాక్షన్-డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో రష్మిక లిల్లి పాత్ర చేయగా, విజయ్ దేవరకొండ బాబీగా నటించాడు. వీరిద్దరి మధ్య జరిగిన ముద్దు సీన్ అప్పట్లో సంచలనం గా మారింది. నెటిజన్లు దీనిపై విమర్శల దాడి చేశారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ గా మరికొందరు కొట్టిపారేశారు. తాజాగా ఈ ఘటనసై ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది. “ డియర్ కామ్రేడే సినిమా సమయంలో తనపై ట్రోలింగ్ నెలల పాటు కొనసాగింది. అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. చాలా పత్రికల్లో నెగెటివ్ వార్తలను సైతం చూశాను. అవి చాలా ఆవేదనకు గురి చేశాయి. చాలా సార్లు నిద్రపోయే సమయంలో దిండుపై ముఖం పెట్టి వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. తన కెరీర్ లో ఆ ట్రోలింగ్స్ చాలా ఆవేదనకు గురి చేశాయి. అయినా, ఇప్పుడు అలాంటి ట్రోలింగ్స్ గురించి పట్టించుకోవడం లేదు. ఎన్నో కలలు కంటున్నాను. వాటిని నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నాను” అని రష్మిక వెల్లడించింది.
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నది. తొలిసారిగా హిందీలో నటించిన ‘గుడ్ బై’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రష్మిక మందన్న సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’ అనే సినిమా చేస్తున్నది. అటు రణ్ బీర్ కపూర్ తో ‘యానిమల్’ అనే చిత్రంలో నటిస్తున్నది. మరోవైపు విజయ్ తో ‘సరసన వరిసు’ అనే సినిమాను చేస్తున్నది. ఇక ఈ ముద్దుగుమ్మ 2021లో హిట్ అయిన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ అయిన పుష్ప: ది రూల్ లో నటిస్తున్నది. ఈ సినిమాలోనూ శ్రీవల్లి పాత్రలో మళ్లీ యాక్ట్ చేయబోతున్నది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తుండగా, ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.