News
News
X

Rashmika: 'ఆషికీ' సీక్వెల్ - వారిని దాటుకొని రష్మిక ఛాన్స్ అందుకుంటుందా?

1990లో మహేష్ భట్ తీసిన 'ఆషికీ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా 2013లో 'ఆషికీ2' వచ్చింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించింది.

FOLLOW US: 

కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక(Rashmika).. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో ఆమెకి పలు సినీ అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా ఆమె పాపులర్ అయింది. ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 

'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో అమితాబ్ కూడా నటించారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే హిందీలో వరుస అవకాశాలు అందుకుంటుంది. అందులో సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' సినిమా ఒకటి. రణబీర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటినుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ క్రేజీ సీక్వెల్ లో రష్మికను హీరోయిన్ గా అనుకుంటున్నారట. 

Rashmika getting busy in Bollywood:1990లో మహేష్ భట్ తీసిన 'ఆషికీ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా 2013లో 'ఆషికీ2' వచ్చింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించింది. ఈ సినిమా మరో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్రాంచైజీలో భాగంగా 'ఆషికీ3' రాబోతుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక పేరుని పరిశీలిస్తున్నారు. ఆమెతో పాటు దీపికా పదుకోన్, అలియా భట్ ల పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నాయి. మరి వీరిని దాటుకొని రష్మిక ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి. 

ఆగిపోయిన రష్మిక సినిమా:

ఇటీవల 'స్క్రూడీలా' అనే మరో సినిమా ఓకే చేసింది రష్మిక. టైగర్ ష్రాఫ్ హీరోగా దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ అంతా చూసుకున్న ఆయన వర్కవుట్ కాదని భావిస్తున్నారు. ఈ సినిమాను రూ.140 కోట్ల రెమ్యునరేషన్ తో చిత్రీకరించాలనుకున్నారు. రీసెంట్ గానే 'లైగర్' సినిమాతో నిర్మాత కరణ్ జోహార్ కి భారీ నష్టాలొచ్చాయి. అందుకే ఇకపై బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ ప్లాప్ అయినా.. తక్కువ నష్టంతో బయటపడే సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నారు. టైగర్ ష్రాఫ్ సినిమా అతడికి రిస్క్ అనిపించడంతో ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు.

ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె 'పుష్ప2'లో నటించడానికి రెడీ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో హీరోతో ప్రేమాయణం, పెళ్లి వరకు వెళ్తుంది రష్మిక. మరిప్పుడు సెకండ్ పార్ట్ లో ఆమె క్యారెక్టర్ ను ఎలా చూపిస్తారో చూడాలి. ఇటీవలే   'పుష్ప2'  సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కొద్దిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

Also Read : సమంతకు జోడీ - దుష్యంత మహారాజు - దేవ్ మోహన్ ఫస్ట్ లుక్

Also Read : భర్తకు నయనతార స‌ర్‌ప్రైజ్‌... అక్కడికి తీసుకువెళ్ళి మరీ 

Published at : 18 Sep 2022 07:47 PM (IST) Tags: Rashmika Rashmika bollywood projects aashiqui

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

టాప్ స్టోరీస్

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !