Animal Movie: నిన్న టైమ్స్ స్క్వేర్, నేడు బుర్జ్ ఖలీఫా- ప్రమోషన్స్ లో 'యానిమల్' గర్జన
Animal Movie: రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం 'యానిమల్'. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం దుబాయ్ లో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
Animal Movie Promotions: ‘కబీర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న ‘యానిమల్’ విడుదలకు రెడీ అవుతోంది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకకురాబోతున్నారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా మీద ‘యానిమల్’ స్పెషల్ కట్ ప్రదర్శించారు.
బుర్జ్ ఖలీఫాపై ‘యానిమల్’ స్పెషల్ కట్ ప్రదర్శన
ఇప్పటికే 'యానిమల్' సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై ఓ రేంజిలో క్యూరియాసిటీ పెంచాయి. చిత్రబృందం సైతం ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోంది. ‘అన్ స్టాపబుల్’ లాంటి టాక్ షోలలో పాల్గొని సినిమాపై అంచనాలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్. ఏకంగా దుబాయ్ లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవంతిపై ‘యానిమల్’ స్పెషల్ కట్ ను ప్రదర్శించారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు దుబాయ్ లో నివసించే భారతీయ సినీ అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. ‘యానిమల్’ ప్రదర్శన చూసి థ్రిల్ గా ఫీలయ్యారు. ప్రవాస భారతీయుల రాకతో బుర్జ్ ఖలీఫా ప్రాంతం జనసంద్రంగా మారింది.
View this post on Instagram
నిన్న టైమ్స్ స్క్వేర్, నేడు బుర్జ్ ఖలీఫా
ఇక ఈ స్పెషల్ కట్ ప్రదర్శన సందర్భంగా చిత్రబృందం దుబాయ్ వెళ్లింది. రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్‌తో పాటు నిర్మాత భూషణ్ కుమార్, సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఈ ప్రదర్శనను దగ్గరుండి చూసి హ్యాపీగా ఫీలయ్యారు. ఇప్పటికే ఈ సినిమా టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శితమై అందరిదృష్టిని ఆకర్షించింది. తాజాగా బుర్జ్ ఖలీఫాపై స్పెషల్ కట్ వేయడంతో ‘యానిమల్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను అట్రాక్ట్ చేసింది.
#RanbirKapoor #BobbyDeol #BhushanKumar #ShivChanana #PranayVangaReddy for the preview of #Animal teaser on #BurjKhalifa pic.twitter.com/oK1L68PDOf
— Sumit Kadel (@SumitkadeI) November 17, 2023
‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ కు చెందిన టి సిరీస్, మురాద్ ఖేతాని కి చెందిన సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగాకు చెందిన భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను క్రైమ్ డ్రామా జానర్ లో తెరకెక్కించారు. సందీప్ రెడ్డి వంగాతో రణ్‌బీర్ తొలిసారి కలిసి పని చేస్తున్నాడు. సందీప్‌కి ఇది రెండో బాలీవుడ్ చిత్రం. ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ అయిన ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది.
Read Also: అదిరిపోయే డ్యాన్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్, ‘యానిమల్’ టీమ్ తో బాలయ్య రచ్చ