Ranbir Kapoor-Alia Bhatt wedding: రణబీర్-అలియా పెళ్లి వేడుక షురూ
అలియా, రణబీర్ పెళ్లికి సంబంధించిన వేడుక మొదలైంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియాభట్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి పెళ్లి తంతు మొదలైంది. ఈరోజు ఉదయం నుంచి రణబీర్-అలియా పెళ్లికి సంబంధించిన పూజలు మొదలయ్యాయి. ముందుగా పితృ పూజ చేశారు. ఆ తరువాత మెహందీ ఫంక్షన్ ను మొదలుపెట్టారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న రణబీర్ ఇంట్లోనే ఈ పెళ్లి వేదిక జరగనుంది.
ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి జరగనుంది. ఆ తరువాత మూడు రోజులకు బాలీవుడ్ ప్రముఖులకు తాజ్ హోటల్ లో పార్టీ ఇవ్వబోతుంది ఈ జంట. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ముందుగా రిషీ కపూర్ నివసించిన కృష్ణరాజ్ బంగ్లాలో పెళ్లి చేయాలనుకున్నారు.
కానీ అక్కడ వర్క్ జరుగుతుండడంతో వద్దనుకున్నారు. ఆ తరువాత ఆర్కే స్టుడియోస్ లో పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ సెక్యూరిటీ సమస్యల వలన బాంద్రాలోని సొంతింట్లోనే పెళ్లి పెట్టుకున్నారు. అలియా కోసం రణబీర్ స్పెషల్ గిఫ్ట్ ను డిజైన్ చేయించాడు. 8 వజ్రాలు పొదిగిన వెడ్డింగ్ బ్యాండ్ ను ఆమెకి గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. పెళ్లి అలియా ఈ బ్యాండ్ ను ధరించనుంది. సబ్యసాచి రూపొందించిన పెళ్లి దుస్తులను ఈ జంట ధరించనుంది.
ఈరోజు రాత్రికి సంగీత్ ఫంక్షన్ ఉంటుంది. ఇప్పటికే రణబీర్, అలియా ఫ్యామిలీలకు చెందిన కీలకమైన సభ్యులంతా రణబీర్ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి ఫొటోలు లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఫొటోలు బయటకొస్తాయో లేదో చూడాలి!
Also Read: 'బీస్ట్' సినిమా టికెట్స్ కొంటే పెట్రోల్ ఫ్రీ - ఎక్కడో తెలుసా?
Also Read: రాజమౌళి, నాగ చైతన్య వాడే ఈ కారు ప్రత్యేకతలు తెలుసా? ఆస్తులు అమ్మినా దీన్ని కొనలేం!
View this post on Instagram