Actor Sanjay Bhargav: ‘నీకు 16, నాకు 18’ సమయంలో శరత్‌బాబు ఆ సలహా ఇచ్చారు - ‘మనసంత నువ్వే’ నటుడు సంజయ్ భార్గవ్
తెలుగు, తమిళ్, కన్నడలో ఎన్నో అద్భుత సినిమాలు చేశారు నటుడు సంజయ్ భార్గవ్. సీరియల్స్ తోనూ తెలుగులో బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Actor Sanjay Bhargav: సంజయ్ భార్గవ్. తెలుగు సినిమా అభిమానులకు ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘నీకు 16 నాకు 18 ‘ సినిమాతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘మనసంతా నువ్వే’ సీరియల్ లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. కర్నాటకలో పుట్టి పెరిగిన ఆయన ‘వల్లి’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తమిళంలో ‘మున్ దినం పార్థేనీ’, ఒరు తులి పున్నగై’, ‘కాదల్ పర్వై’, ‘భక్తన్’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలు విజయ్ కుమార్, విజయ్ కాంత్ తో కలిసి పని చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా బుల్లితెరకు పరిచయం అయ్యారు. పలు భాషల్లో సీరియల్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
రామోజీ రావు ఆ క్యారెక్టర్ చేయమన్నారు!
“ప్రస్తుతం ‘మనసంతా నువ్వే’ అనే సీరియల్ చేస్తున్నాను. సక్సెస్ ఫుల్ గా ఈ సీరియల్ రన్ అవుతోంది. ఈ సీరియల్ కోసం నాకు ఓ కాల్ వచ్చింది. ఈటీవీలో ఓ సీరియల్ రాబోతోంది.. ఫాదర్ క్యారెక్టర్ ఉంది చేస్తారా? అని అడిగారు. నేను ఫాదర్ క్యారెక్టర్ చేయను అని చెప్పాను. కానీ, యంగ్ ఫాదర్ క్యారెక్టర్ అది. రొమాంటిక్ గా ఉంటుంది అని చెప్పారు. బాపినీడు, రామోజీ రావు గారు ఈ క్యారెక్టర్ బాగుటుంది చేయాలన్నారు. సుమారు రెండు నెలల చర్చల తర్వాత నేను ఓకే చెప్పారు. ఈ సీరియల్ లో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సీరియల్ లో ఫీమేల్ లీడ్ చేస్తున్న ఆవిడ కూడా నాతో జోవియల్ గా ఉంటుంది. షూటింగ్ అయ్యాక అన్నా.. ఏం చేస్తున్నారు? లంచ్ కి, డిన్నర్ కి వెళ్దామా? అని అడుగుంది. మా ఇద్దరి మధ్య ఫ్యామిలీ మెంబర్స్ లా బాండింగ్ ఏర్పడింది. ఈ సీరియల్ కెమెరామెన్ ఓం ప్రకాష్ కూడా చాలా అమేజింగ్ పర్సన్. ఆయన నా కోసం ఇంటి నుంచి ఫుడ్ తీసుకొస్తారు. ఫుడ్ విషయంలో నాకు ఇది ఇష్టం అని లేదు. ఎవరు ఫుడ్ ఇచ్చినా చక్కగా తినిపెడతాను. మనకు ఆకలి తీరితే సరిపోతుంది” అని చెప్పారు.
ఓటీటీలోకి అడుగు పెట్టాలని ఉంది!
సినిమాలు, సీరియల్స్ మాత్రమే కాదు, ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు సంజయ్ భార్గవ్. టైం వచ్చినప్పుడు అవకాశాలు వాటంతట అవే వస్తాయన్నారు. “మూవీస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. సీరియల్స్ కూడా చేస్తున్నాను. ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను. అవకాశం ఏదైనా చేయడానికి రెడీ ఉంటాను. నార్త్ లోనూ అవకాశాల కోసం ప్రయత్నించాను గానీ, రాలేదు. ‘నీకు 16 నాకు 18 ‘ సినిమా చేసే సమయంలో సీనియర్ నటుడు శరత్ బాబు గారు నాకు చాలా సలహాలు ఇచ్చేవాళ్లు. నన్ను కథలు రాయాలని చెప్పేవారు. ఆయన మాటలు విన్నాకే నాకు కథలు రాయాలనే ఆలోచన వచ్చింది” అని చెప్పారు.
దర్శకుడు చెప్పినట్లు చేయాలి!
ఇక కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే నటీనటులు దర్శకుడు ఎలా చెప్పే అలా చేయాలని సంజయ్ భార్గవ్ చెప్పారు. మనం ఓ మైండ్ సెట్ తో ఉండకూడదన్నారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏండ్లు అవుతున్నా, దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేస్తానన్నారు. ఇక “క్లాసికల్ డ్యాన్స్ అనేది అన్ని డ్యాన్సులకు మాస్టర్ లాంటిది. మగవాళ్లు క్లాసిక్ డ్యాన్స్ చేయడానికి భయపడతారు. కానీ, కమల్ హాసన్ లాంటి వాళ్లు కూడా క్లాసికల్ డ్యాన్స్ ను ఎంతో అద్భుతంగా చేశారు. అందుకే నేను కూడా క్లాసికల్ డ్యాన్సర్ ను అని చెప్పుకోవడానికి హ్యాపీగా ఫీలవుతున్నాను. మనం చేసే పని ఏదైనా చక్కగా చేయాలి. అదే సక్సెస్ అందిస్తుంది. నేను ఏదైనా సీన్ చేసే సమయంలో సరిగా చేయకపోతే ఆ తర్వాత బాధపడతాను. సరిగా చేయలేదే అని ఫీల్ అవుతాను. నా దృష్టిలో ఫెయిల్యూర్ అనేది సక్సెస్ లో ఒక పార్ట్” అన్నారు.
Also Read: శృతి హాసన్ తో లోకేష్ రొమాన్స్- బాబోయ్ మరీ ఇంతలా రెచ్చిపోయారేంటి?