అన్వేషించండి

Inimel Promo: శృతి హాసన్ తో లోకేష్ రొమాన్స్- బాబోయ్ మరీ ఇంతలా రెచ్చిపోయారేంటి?

తమిళ దిగ్గజ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. నటుడిగా వెండితెర మీద అడుగు పెట్టిన ఆయన, శృతి హాసన్ తో ఓ రేంజిలో రొమాన్స్ చేశారు.

Lokesh Kanagaraj and Shrutis Romance: తమిళ స్టార డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు లోకేష్ కనగరాజ్. ఆయన తెరకెక్కించిన రీసెంట్ మూవీస్ ‘విక్రమ్’, ‘లియో’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. ఇప్పుడు  లోకేష్ మెగా ఫోన్ వదిలి నటుడి అవతారం ఎత్తారు. శృతిహాసన్ తో కలిసి ‘ఇనిమేల్’ అనే మ్యూజిక్ వీడియోను చేస్తున్నారు. ఈ పూర్తి సాంగ్ త్వరలో విడుదల కానుంది. తాజాగా దీనికి సంబంధించి ఓ చిన్న ప్రోమోను విడుదల చేశారు. ఇందులో శృతిహాసన్, లోకేష్ రొమాన్స్ చూసి ఆడియెన్స్ అవాక్కవుతున్నారు. ఇందులో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా, ఇద్దరు హాట్ హాట్ గా రెచ్చిపోయిన విధానం చూసి షాక్ అవుతున్నారు. లోకేష్ రొమాన్స్ చేయడంలో మరీ ముదురులా ఉన్నాడే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

రొమాన్స్ తో అలరించిన లోకేష్, శృతి

ఇంతకాలం దర్శకుడిగా కనిపించిన లోకేష్, ఈ పాటలో ఆయన నటించిన విధానం చాలా షాకింగ్ గా ఉంది. శృతి హాసన్ తో అవలీలగా రొమాన్స్ సీన్స్ చేయడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, తొలిసారి కెమెరా ముందుకు రావడంతో ఆయనలో కాస్త బెదురు కనిపిస్తోంది.  మొత్తం 18 సెకెన్ల ప్రోమో పూర్తి రొమాన్స్ తో నిండిపోయింది. థియేటర్ లో రొమాంటిక్ సన్నివేశాలతో మొదలైన ప్రోమో, ఇంట్లో సోఫా సెట్ లో ఒకరి మీద మరొకరు పడేంత వరకు సాగుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో లోకేష్ గెస్ట్ రోల్ పోషించారు. అయితే, పూర్తి స్థాయి వీడియో సాంగ్ లో చేయడం, అదీ మొత్తంగా రొమాంటిక్ సాంగ్ లో నటించడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. పీకల్లోతు ప్రేమలో ఉన్న ఓ జంట చుట్టూ ఈ సాంగ్ తిరగనున్నట్లు తెలుస్తోంది.

మార్చి 25న ‘ఇనిమల్’ వీడియో సాంగ్ విడుదల

ఇక ‘ఇనిమల్’ వీడియో సాంగ్ కు లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు సాహిత్యం అందించడం విశేషం. అంతేకాదు, ఈ మ్యూజిక్ వీడియోకు శృతి హాసన్ మ్యూజిక్ తో పాటు కాన్సెప్ట్ ను కూడా అందించింది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ మ్యూజిక్ వీడియో ఈ నెల(మార్చి) 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మ్యూజిక్ వీడియోను ద్వారకేష్ ప్రభాకర్ తెరకెక్కిస్తున్నారు.

దర్శకత్వం వదిలేస్తారా?   

 వాస్తవానికి కొద్ది రోజుల క్రితం లోకేష్ కనగరాజ్ తన దర్శకత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 10 సినిమాల తర్వాత మళ్లీ దర్శకత్వం చేయను అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటుడిగా మారాలని భావిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇక ‘ఇనిమేల్’ మ్యూజిక్ వీడియో విడుదల అయ్యాక, ఆయన యాక్టింగ్ స్కిల్స్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటే నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభం అయినట్లేనని చెప్పుకోవచ్చు. లోకేష్ తన తర్వాతి చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Read Also: కుమారి అక్క.. బ్రేక్ తీస్కో, మా వంటలక్క వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఆ సీక్రెట్ చెప్పేసిన డాక్టర్ బాబు

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Jagadhatri Serial Today JULY 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget