By: ABP Desam | Updated at : 24 May 2023 10:55 AM (IST)
రామబాణం(Image Credits : Gopichand/Twitter)
Ramabanam : మాచో స్టార్ గోపీచంద్ నటించిన 'రామబాణం' ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీవాస్‌తో గోపిచంద్ కు ఇది మూడవ చిత్రం. ఈ ఫ్యామిలీ డ్రామాలో డింపుల్ హయాతి కథానాయికగా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీపై ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులును సోనీ లైవ్ (Sony LIV) దక్కించుకుందని తెలిసింది. ఈ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫాంలో ఈ చిత్రాన్ని జూన్ 3, 2023న ప్రీమియర్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.
ఈ సినిమా మే 5 రిలీజ్ కాగా నెల రోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుండడం గమనార్హం. యాక్షన్ ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రూపొందిన 'రామబాణం'... గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ మొత్తానికి ఓటీటీ హక్కులను సోనిలివ్ కొనుగోలు చేసినట్లు ఇటీవల పలు కథనాలు కూడా వెలువడ్డాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే దాదాపు ఎనిమిది కోట్లకు రామబాణం డిజిటల్ రైట్స్‌ను సోనిలివ్ దక్కించుకోన్నట్లు సమాచారం. ఇంతకుముందు లక్ష్యం, లౌక్యం హిట్స్ అందించిన గోపీచంద్, శ్రీవాస్ కాంబో.. ఈ సారి మాత్రం ఇద్దరికీ హ్యాట్రిక్ విజయాన్ని అందివ్వలేకపోయింది. దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ.. థియేట్రికల్ రన్‌లో కేవలం పది కోట్ల వరకు మాత్రమే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. కథలో కొత్తదనం లేకపోవడమే 'రామబాణం' డిజాస్టర్‌కు ప్రధాన కారణమనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి ప్రారంభంలో రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చినా.. విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీతో గోపీచంద్ మళ్లీ హిట్ కొడతాడని నమ్మిన ఆయన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.
'రామబాణం' సినిమాలో విక్కీ భాయ్ అనే మాఫియా డాన్‌గా గోపీచంద్ ఓ మాస్ పాత్రలో నటించాడు. తన కుటుంబానికి ఎదురైన ఆపదను విక్కీ భాయ్ ఎలా పరిష్కరించాడన్నది యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేస్తూ దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ గోపీచంద్‌కు జోడీగా నటించిన డింపుల్ హయతి పర్వాలేదన్నట్టుగానే అనిపించింది. ఇక సినిమాలో కీలక పాత్రలు పోషించిన జగపతిబాబు, ఖుష్భూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు.
గోపీచంద్ హీరోగా చేసిన 'రామబాణం'లో జగపతి బాబు, కుష్బూ సుందర్, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను కూడా పలు పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
Read Also: శరత్ బాబు నన్ను సిగరెట్ తాగొద్దని మందలించేవాడు: రజనీ కాంత్
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Ponniyin Selvan 2 on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా
విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’? - ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!