News
News
వీడియోలు ఆటలు
X

Ready Movie Re-Release: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న రామ్ పోతినేని బ్లాక్ బస్టర్ మూవీ, ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బ్లాక్ బస్టర్ మూవీ ‘రెడీ’. ఈ చిత్రం ఆయన బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ కాబోతోంది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ యువ హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. క్లాస్ సినిమాలతో పాటు ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి ఊర మాస్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ హీరో ఊర మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.  

రామ్ బర్త్ డే సందర్భంగా ‘రెడీ’ రీ రిలీజ్!

ఇక రామ్ పోతినేని కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘రెడీ’ ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతోంది.  మే 15న రామ్ పుట్టిన రోజు జరపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ఈ హిట్ సినిమాను విడుల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.  4K క్వాలిటీలో ఆయన అభిమానులు ఈ సినిమాను చూడనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించారు.  రాక్ స్టార్ డిఎస్పీ సంగీతం అందించారు. ఈ చిత్రం లో రామ్ సరసన హీరోయిన్ గా జెనీలియా నటించింది.  ఎమ్‌ఎస్ నారాయణ, నాజర్, బ్రహ్మానందం, షఫీ సహా పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. 2008లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఈ చిత్రానికి మూడు నంది అవార్డులు దక్కాయి.  2009లో కన్నడంలో ‘రామ్’ అనే పేరుతో, 2010లో తమిళంలో ‘ఉత్తమ పుదిరన్’ అనే పేరుతో, 2011లో హిందీలో ‘రెడీ’ అనే పేరుతో రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

View this post on Instagram
 
A post shared by RAm POthineni (@ram_pothineni)

బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న రామ్

ప్రస్తుతం రామ్ పోతినేని ప్రస్తుతం  బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.  అంతేకాదు, రామ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు.  ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.  సెకండ్ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్‌ను బోయపాటి తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ పోతినేని చివరిగా 'ది వారియర్' అనే సినిమాలో నటించారు. లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఆదిపినిశెట్టి విలన్ గా కనిపించారు. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.  తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాలో డాక్ట‌ర్‌గా, పోలీస్ ఆఫీసర్ గా రామ్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఎనర్జటిక్ పెర్ఫార్మన్స్ చూపించారు. అయితే, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

View this post on Instagram
 
A post shared by RAm POthineni (@ram_pothineni)

Read Also: ‘Miss శెట్టి Mr పొలిశెట్టి’పై రామ్ చరణ్ రివ్యూ - స్వీటీ ఫ్యాన్స్ ఫుల్‌ఖుష్!

Published at : 05 May 2023 10:15 AM (IST) Tags: Ram Pothineni Ram Pothineni BirthDay Ready Movie Ready Movie Re-Release

సంబంధిత కథనాలు

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?