Ram Gopal Varma: ఛీ, ఖర్మ.. అషూ రెడ్డికి అక్కడ కెమేరా పెట్టిన వర్మ.. అది నేను కాదంటూ ఆర్జీవీ బుకాయింపు!
ఆర్జీవీ మళ్లీ వార్తాల్లోకి ఎక్కారు. ఈ సారి ఆయన అషూ రెడ్డిని అభ్యంతరకరంగా వీడియో తీసి.. అది నేను కాదంటూ బుకాయించారు.
దర్శకుడు వర్మ పేరు వింటే చాలు.. అంతా ఇప్పుడు ‘అయ్యో ఖర్మ’ అని తలబాదుకుంటున్నారు. ఒకప్పుడు దర్శకుడిగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వర్మ.. ఇప్పుడు అమ్మాయిలతో వేస్తున్న వేషాలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. మొన్న అరియానాతో ‘అడల్ట్’ ఇంటర్వ్యూలో పచ్చిగా మాట్లాడిన వర్మ.. ఇప్పుడు అషురెడ్డితో జతకట్టారు. ఆమెతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బల్ల కిందకు వంగ తన మొబైల్ కెమేరాతో అషూ రెడ్డి తొడలను షూట్ చేయడం చర్చనీయమైంది. ఈ వీడియోను అషూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘నో అంటే నో అంతే’ అని క్యాప్షన్ ఇచ్చింది. వర్మ అలా తనని షూట్ చేయడం తనకు ఇష్టం లేదున్నట్లుగా పేర్కొంది.
ఈ వీడియోలో ఆర్జీవీ ఆమె తొడలను తన కెమేరాతో రికార్డు చేస్తుంటే.. అషూ మాత్రం వద్దు వద్దు అని చెప్పడం కనిపించింది. ఈ నేపథ్యంలో నెటిజనులు కూడా అషూ రెడ్డిపై కామెంట్లు చేస్తున్నారు. ఆర్జీవీతో ఇంటర్వ్యూ అంటే దుస్తులు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని, అలా పొట్టి దుస్తులు వేస్తే అతడి చూపు అక్కడే ఉంటుందని పచ్చిగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘అతను డైరెక్టర్ కాబట్టి ఏమీ అనలేదు. అదే పని సామాన్యుడు చేసినా.. అలా చూసినా.. కొట్టేసి పెద్ద రాద్దాంతం చేస్తారు’’ అని మరొకరు కామెంట్ చేశారు.
అషూ రెడ్డి పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో:
అయితే, ఈ వీడియో ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘అందులో ఎడమ వైపు ఉన్నది నేను కాదు. కుడి వైపు ఉన్నది అషూ రెడ్డి కాదు. #AriyanaBoldRgv తరహాలోనే #AshuBoldRgv అనే ఇంటర్వ్యూను మేం చేయలేదు. దేవుళ్ల మీద ఒట్టు. కానీ, దేవతల మీద కాదు’’ అని అషూరెడ్డి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లింక్‌ను ఆయన ట్వీట్ చేశారు. దీంతో నెటిజనులు ఆర్జీవీని ఆడేసుకుంటున్నారు. ‘‘నువ్వు ఎవరినీ వదలవా సామీ’’ అని ప్రశ్నిస్తున్నారు. అయినా ఆ వీడియోలో అషూ మీ పేరు ఎత్తలేదని, అందులో ఉన్నది నేను కాదని చెప్పుకోవడం ఎందుకని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఆర్జీవీ స్పందన (ట్వీట్):