News
News
X

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవెర్సీకి తెరతీశారు. ఇటీవల ఆయన ‘డేంజరస్’ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీను తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో..

FOLLOW US: 
Share:

ర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే అవుతుంది. తన వ్యాఖ్యలతో ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు వర్మ. అలాగే ఒక్కోసారి ఆర్జీవీ చేసే చేష్టలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవెర్సీకి తెరతీశారు. ఇటీవల ఆయన ‘డేంజరస్’ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీను తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను కూడా భారీగానే చేస్తున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డితో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ను ప్లాన్ చేశారు వర్మ. ఈ ఇంటర్య్వూ చివరలో వర్మ అషురెడ్డి పాదాలకు ముద్దు పెట్టడం సన్సేషన్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతోంది. 

అయితే ఆ ఇంటర్య్వూ తర్వాత ఆర్జీవి ఓ చానెల్ లో ఇంటర్య్వూ కి వెళ్లారు. అక్కడ ఆ ఇంటర్వ్యూ కోసం అషు రెడ్డి నే ఎంచుకోవడం వెనుక రీజన్ ఏంటని ప్రశ్నించగా.. దానికీ వర్మ తన స్టైల్ లో వివరణ ఇచ్చారు. చాలా మంది శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడ్డానికి ఇష్టపడరని, ఎవరో ఏదో అనుకుంటారు అని భయపడతారని చెప్పారు. అలాంటి విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడాలి అంటే వారిలో ఆ స్ట్రెంత్ ఉండాలని, అది అషురెడ్డిలో ఉందని అందుకే తనతో ‘డేంజరస్’ సినిమా గురించి ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. తన ఆలోచనా విధానం, లైఫ్ స్టైల్ పై అషు రెడ్డి కి కూడా రెస్పెక్ట్ ఉందని, అందుకే ఆ ఇంటర్వ్యూ సులువుగా చేయగలిగామని చెప్పుకొచ్చారు వర్మ. అంతేకాదు అషు రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చోవడానికి  కూడా ఓ రీజన్ చెప్పారు. చాలా మంది మగవాళ్లకు ఇలాంటివి నచ్చవని, కానీ ఎంత పెద్ద పురుష వీరుడైనా కాంత దాసుడే అనే సత్యాన్ని వాళ్లందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే అషురెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్నానని అన్సర్ ఇచ్చాడు వర్మ. 

రామ్ గోపాల్ వర్మ ఇలాంటి బోల్డ్ ఇంటర్వ్యూ లు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. అషురెడ్డి తోనే గతంలో ఇలాంటి బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ట్రోలింగ్ కు గురయ్యారు ఆర్జీవి. ఆ ఇంటర్య్యూ లో వర్మ వ్యాఖ్యలు, చేష్టలు పెద్ద దుమారమే లేపాయి. మళ్లీ ఇప్పుడు రెండోసారి అషురెడ్డితో ఇంటర్వ్యూ చేసి మరో కాంట్రవెర్సి కి తెరతీశారు. ఈ ఇంటర్వ్యూలో అషురెడ్డి పాదాలకు ముద్దుపెట్టడం పట్ల నెటిజన్స్ మండిపడుతున్నారు. ‘వర్మ మాకేంటీ కర్మ’ అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. అంతకు ముందు కూడా కొంతమంది యాంకర్ల తో ఇలాంటి ఇంటర్య్వూలు చేసి వార్తల్లోకెక్కాడు ఆర్జీవి. యాంకర్ అరియానా తో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి జిమ్ లో తనతో రకరకాల ఫీట్లు చేయించాడు. అది కూడా బాగా వైరల్ అయ్యింది. ఇలా లెక్కపెట్టుకుంటూ పోతే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ట్విస్ట్ లు చాలానే ఇచ్చాడనే చెప్పాలి. ఇక ఆర్జీవి ‘డేంజరస్’ సినిమా ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also read: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

Published at : 08 Dec 2022 03:52 PM (IST) Tags: ashu reddy Ram Gopal Varma RGV RGV Ashu Reddy RGV-Ashu Reddy

సంబంధిత కథనాలు

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

టాప్ స్టోరీస్

Kotamreddy vs Balineni: నా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చూపిస్తా, కాచుకో బాలినేనీ!: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం

Kotamreddy vs Balineni: నా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చూపిస్తా, కాచుకో బాలినేనీ!: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ