RGV's LADKI Trailer: హాట్ 'లడకీ'... రామ్ గోపాల్ వర్మ మార్క్ గ్లామర్ మూవీ!
రామ్ గోపాల్ వర్మ నుంచి మరో సినిమా వస్తోంది. టైటిల్ 'లడకీ'. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా రూపొందినా... ట్రైలర్ అంతా వర్మ గ్లామర్ షో ఫుల్లుగా ఉంది.
![RGV's LADKI Trailer: హాట్ 'లడకీ'... రామ్ గోపాల్ వర్మ మార్క్ గ్లామర్ మూవీ! Ram Gopal Varma mark written all over the LADKI Trailer Pooja Bhalekar glam show grabs the youth attention RGV's LADKI Trailer: హాట్ 'లడకీ'... రామ్ గోపాల్ వర్మ మార్క్ గ్లామర్ మూవీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/08/081017a4aeb14fb527d22309506a6d8f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మాఫియా కథలను డీల్ చేయడంలో రామ్ గోపాల్ వర్మది సపరేట్ స్టయిల్. అలాగే, అమ్మాయిలను గ్లామరస్‌గా చూపించడంలో కూడా! కెమెరా యాంగిల్స్ నుంచి టేకింగ్, మేకింగ్ వరకూ వర్మ అమ్మాయిలను చూపించే విధానంపై కొంత మంది విమర్శలు చేస్తున్నారు. అయితే... ఆయన అవన్నీ పట్టించుకోరు. తనదైన శైలిలో సినిమాలు తీస్తుంటారు. 'లడకీ' ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. హిందీలో ట్రైలర్ విడుదల చేశారు. చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' సినిమాకు హిందీ వెర్షన్ ఇది.
Here is TRAILER of My Most Ambitious and Most Expensive Film LADKI in HINDI and DRAGON GIRL in Chinese produced by ARTSEE MEDIA , featuring India’s 1st female martial artiste/actor @PoojaBofficial https://t.co/tYiu1nh3NW https://t.co/d0qxeIU2Kz https://t.co/EHcc5T3YkN #RgvsLadki
— Ram Gopal Varma (@RGVzoomin) November 8, 2021
'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' టీజర్, పూజా భలేకర్ ట్రైనింగ్ క్లిప్స్ ను సుమారు పదకొండు నెలల క్రితమే విడుదల చేశారు. ఇప్పుడీ ట్రైలర్ అంతకు మించి అనేలా ఉంది. ఇండో - చైనీస్ కోప్రొడక్షన్ లో సినిమా రూపొందింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఓ అమ్మాయి ఏం చేసింది? ఏంటి? అనేది కథగా తెలుస్తోంది. కథ పక్కన పెడితే... ట్రైలర్ అంతా పూజా భలేకర్ గ్లామర్ షో హైలైట్ అని చెప్పాలి. వర్మ మార్క్ టేకింగ్ ఉందని చెప్పాలి. హీరోయిన్ చేత బికినీ వేయించి ఫైట్స్ చేయించే ధైర్యం వర్మ మాత్రమే చేయగలరని చెప్పాలి.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆర్ట్ సి మీడియా, చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన 'ఎంటర్ ది డ్రాగన్' చిత్రానికి ఈ 'లడకి' నివాళి అని చిత్రబృందం చెబుతోంది.
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
Also Read: మహేష్ బరువు బాధ్యతలు తీసుకుంటాడా? చూద్దామంటున్న నాగార్జున!
Also Read: 'రాజా విక్రమార్క' సినిమాకు... జేడీ లక్ష్మీనారాయణకు ఓ సంబంధం ఉంది! అదేంటో తెలుసా?
Also Read: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Also Read: ఖం... ఖం... ఖంగుమంది 'అఖండ' శంఖం! ధర్మభేరి శబ్దం... చెయ్యమంది యుద్ధం!
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గణేష్... పవన్‌ను జాగ్రత్తగా చూసుకుంటావా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)