Ram Gopal Varma: 'మీరు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు' వర్మ పొగిడిన లేడీ యాంకర్ ఎవరంటే..?
వర్మలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. తనకు ఎవరైనా అమ్మాయి నచ్చితే చాలు వెంటనే కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంతో పాటు పలు విషయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. రీసెంట్ గా ఏపీ టికెట్ రేట్ ఇష్యూ గురించి వర్మ చేసిన ట్వీట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు.. ఏపీ జగన్ మీట్ అవ్వడంపై ఘాటు విమర్శలు చేశారు వర్మ.
అలానే వర్మలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. తనకు ఎవరైనా అమ్మాయి నచ్చితే చాలు వెంటనే కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. పలు టీవీ ఛానెల్స్ కు, యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ.. లేడీ యాంకర్ల అందాలను తెగ పొగిడేస్తుంటారు. బిగ్ బాస్ అరియనా.. వర్మని ఇంటర్వ్యూ చేసే ఆ రేంజ్ లో పాపులర్ అయింది.
తాజాగా వర్మ మరో యాంకర్ ను పొగుడుతూ స్టేజ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'బడవ రాస్కెల్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు వర్మ. ఈ ప్రోగ్రామ్ ను హోస్ట్ చేస్తోన్న యాంకర్ శ్యామలను ఉద్దేశిస్తూ.. 'ఇంత అందంగా మీరు నువ్ నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు' అంటూ శ్యామలపై రొమాంటిక్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు విన్న శ్యామల నవ్వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక 'బడవ రాస్కెల్' సినిమా విషయానికొస్తే.. 'పుష్ప' ఫేమ్ ధనుంజయ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. కన్నడలో పెద్ద హిట్ అయిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 18న సినిమా విడుదల కానుంది.
View this post on Instagram