Megastar Grandfather: తాతను కాబోతున్నా - ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్!
Upasana Pregnancy: మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. తాను తాతను కాబోతున్నట్లు వెల్లడించారు. రాంచరణ్ దంపతులు తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు చెప్పారు.
Ram Charan And Wife Upasana Expecting First Child: మెగా అభిమానులకు చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. తన కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రకటించారు.
రాంచరణ్-ఉపాసన పెళ్లై చాలా కాలం అవుతున్నా, ఇంత కాలం పిల్లల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పిల్లలు ఎప్పుడు? అనే ప్రశ్నకు ఇటు ఉపాసన గానీ, అటు రాంచరణ్ గానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. గతంలో ఓసారి పిల్లల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన.. సరైన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తామని తెలిపారు.
తాత కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన చిరంజీవి
ఇన్నాళ్లకు ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. రాంచరణ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా వెల్లడించారు. శ్రీ హనుమాన్ ఆశీస్సులతో ఉపాసన, రాంచరణ్ తమ తొలి బిడ్డ (Ram Charan, Upasana To Become Parents)ను కనబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022
నెటిజన్ల శుభాకాంక్షలు
ఈ వార్త విని మెగా అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. చాలా కాలం తర్వాత గొప్ప వార్త చెప్పారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాంచరణ్ దంపతులతో పాటు తాత కాబోతున్న చిరంజీవికి శుభాకాంక్షలు చెప్తున్నారు.
Read Also: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ మహారాజా లుక్ ఇదే, ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయిందిగా!
View this post on Instagram
పదేండ్ల క్రితం అంగరంగ వైభవంగా చెర్రీ-ఉపాసన పెళ్లి
మెగాస్టార్ తనయుడు రాం చరణ్, అపోలో హాస్పిటల్స్ చైర్మెన్ ప్రతాపరెడ్డి మనువరాలు ఉపాసన వివాహం జూన్ 14, 2012న జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ మధ్యే చెర్రీ, ఉపాసన తమ పదో వివాహ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇద్దరు ముందుగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే, కుటుంబ సభ్యుల అంగీకారంతో పెద్దల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత రాంచరణ్, ఉపాసన ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఉపాసన బాధ్యతలు నిర్వహిస్తుండగా, హీరో రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే, పెళ్లై దశాబ్దం పూర్తవుతున్నా, పిల్లలు లేకపోవడం పట్ల చిరంజీవి అభిమానులు లోటుగా ఫీలయ్యారు. తాజాగా చిరంజీవి చెప్పిన గుడ్ న్యూస్ చెర్రీ, ఉపాసన కుటుంబాలతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా మస్త్ ఖుషీ అవుతున్నారు.