News
News
X

Ravi Teja First look: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ మహారాజా లుక్ ఇదే, ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయిందిగా!

‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి మరో మాస్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అయ్యింది. తెలంగాణ యాసలో మాస్ మహారాజా చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి.

FOLLOW US: 
Share:

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా నటిస్తూనే ఉన్నారు. ఆయన హీరోగా పలు సినిమాలు తెరకెక్కతున్నాయి. మరోవైపు మెగాస్టారం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీరోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి చిరంజీవికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పటి వరకు రవితేజకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. కొద్ది రోజులుగా ఈ సినిమాలో ఆయన లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూ స్తున్నారు.

‘వాల్తేరు వీరయ్య’ నుంచి మాస్ అప్ డేట్, ఊగిపోతున్న రవితేజ ఫ్యాన్స్

ఎట్టకేలకు రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అయే అప్ డేట్ వచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఆయన ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే ఇందులో కమర్షియల్, మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ‘‘ఫస్ట్ టైం ఓ మేకపిల్లను ఎత్తుకుని పులి వస్తా ఉన్నాది..’’ అనే ఎలివేషన్ డైలాగ్ తో టీజర్ లో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. భోజనాల సెటప్, దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్న చోటుకు రవితేజ అడుగు పెడతారు. అక్కడ కొంతమందితో స్టైలిష్ గా ఫైట్ చేస్తారు. ఫైట్ జరుగుతున్నంతసేపూ చేతిలో మేకపిల్లను పట్టుకునే ఉంటారు. మధ్యలో సిలిండర్ సీల్ తీసేసి,  గ్యాస్ లీక్ అవుతుండగా ఆ సిలిండర్ ను పట్టుకుని రవితేజ నడుచుకుని వస్తారు. అప్పుడు తెలంగాణ యాసలో ఓ డైలాగ్ చెప్తారు. “ఏంరా వారీ పిసాపిస చేస్తున్నావ్.. నీకింకా సమజ్ కాలే... నేను ఎవని అయ్యకు ఇననని...” అంటూ గర్జిస్తారు. ‘ఎవరి అయ్యకు ఇనను.. ‘ అనే ముక్క వీరయ్య గురించే అని, అది చిరంజీవికి వార్నింగే అయి ఉంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చ జరుపుతున్నారు.  సినిమాలో చిరంజీవి, రవితేజ  మధ్య రిలేషన్ ఏంటా? అని ఆరా తీస్తున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదల

ఈ మెగా మాస్ యాక్షన్ ఫెస్టివల్ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. జనవరి 13  2023న థియేటర్లలోకి అడుగు పెట్టబోతోంది.  మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌, బాస్‌ పార్టీ సాంగ్స్‌  ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.

Read Also: రజనీకాంత్ లైఫ్‌లో మరపురాని అచీవ్‌మెంట్స్ ఇవే, ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Published at : 12 Dec 2022 12:40 PM (IST) Tags: Mass Maharaja Ravi Teja Waltair Veerayya Movie Ravi Teja First look Teaser

సంబంధిత కథనాలు

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

టాప్ స్టోరీస్

Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?

Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్