By: ABP Desam | Updated at : 12 Dec 2022 12:09 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@rajinikanth/twitter
సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ నటదిగ్గజం. ‘తలైవా’గా అభిమానలోకానికి సుపరిచితం. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు ఆయన అభిమానులు ఉన్నారు. కర్ణాటకలోని మరాఠా కుటుంబంలో డిసెంబర్ 12, 1950న జన్మించారు రజనీకాంత్. బస్ కండక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆన్ స్క్రీన్ మీద ఆయన నటన, ఆఫ్-స్క్రీన్ లో సింప్లిసిటీని ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతారు. సినీ రంగానికి తను చేసిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు.
1. రజనీకాంత్ 1975లో దర్శకుడు కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీవిద్య ప్రధాన పాత్రల్లో నటించారు. 15, ఆగస్ట్ 1975న విడుదల అయ్యింది. తొలి చిత్రమే చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకుంది.
2. రజనీకాంత్ నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చారు. సినిమా రంగంలోకి రాకముందు రజనీకాంత్ కూలీగా, కార్పెంటర్‌గా, బస్ కండక్టర్ గా పని చేశారు.
3. రజనీ కాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పేరు మీదుగా ఆయనకు ఈ పేరు పెట్టారు. అతడు మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతూ పెరిగారు.
4. ఇండస్ట్రీలోకి వచ్చాక, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నటనలో డిప్లొమా తీసుకున్నారు. ఆ సమయంలోనే తమిళం కూడా నేర్చుకున్నారు.
5. రజనీకాంత్ తన కంటే వయసులో 8 సంవత్సరాలు పెద్ద అయిన లతా రంగాచారిని వివాహం చేసుకున్నారు. లత తన కాలేజీ మ్యాగజైన్ కోసం అతనిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఇద్దరూ కలుసుకున్నారు. వారు 1981లో వివాహం చేసుకున్నారు. లత ఇప్పుడు చెన్నైలో 'ది ఆశ్రమ్' అనే పాఠశాలను నడుపుతున్నారు. రజనీ, లతలకు ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఉన్నారు.
6. రజనీ కాంత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో విలన్‌గా కెరీర్ మొదలు పెట్టారు. 70 ఏళ్ల ఈ నటుడి కెరీర్‌లోని తొలి రెండు సంవత్సరాలు కేవలం నెగెటివ్ రోల్స్ మాత్రమే లభించాయి. ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం అయిన ‘భువన ఒరు కెల్విక్కురి’ చిత్రంతో మంచి పాత్రలు పోషించడం మొదలు పెట్టారు.
7. దీవార్, అమర్ అక్బర్ ఆంటోనీ, లావారీస్, డాన్ సహా అమితాబ్ బచ్చన్ నటించిన 11 సినిమాలను రజనీకాంత్ రీమేక్ చేశారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి.
8. రజనీకాంత్ ‘శివాజీ’ సినిమా కోసం 2007లో రూ.26 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఆసియాలో జాకీ చాన్ అత్యధిక రెమ్యునరేషన్ పొందిన నటుడిగా రజనీ గుర్తింపు పొందారు.
9. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నటుడు ధనుష్‌ను వివాహం చేసుకుంది. అతని చిన్న కుమార్తె సౌందర్య నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్ వనంగముడిని పెళ్లి చేసుకుంది.
10. రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్విటర్‌లో సూపర్ స్టార్‌కు ప్రపంచ వ్యాప్తంగా 5.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
రజనీకాంత్ హిందూ మతాన్ని, ఆధ్యాత్మికతను బలంగా విశ్వసిస్తారు. యోగా, ధ్యానం చేస్తారు. ఆయన తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 170 చిత్రాలకు పైగా నటించారు.
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?
The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!
HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?