By: ABP Desam | Updated at : 24 Apr 2022 05:58 PM (IST)
'ఆచార్య' ప్రమోషన్స్ లో చరణ్ కామెంట్స్
'ఆచార్య' సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. చిరంజీవి, రామ్ చార వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇందులో భగంగా ఈరోజు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు చరణ్. 'ఆచార్య' గురించే కాకుండా తన తదుపరి సినిమా RC16 గురించి కూడా మాట్లాడారు. నిజానికి తనకు ఆప్షన్స్ ఇచ్చే దర్శకులంటే నచ్చదని.. వాళ్లు తనతో ఎలాంటి కథ తీస్తే బాగుంటుందో ముందు డిసైడ్ అయ్యి తనను ఎప్రోచ్ అయితే బాగుంటుందని అన్నారు.
ఇటీవలే ఓ పెద్ద దర్శకుడు తన దగ్గర నాలుగు కథలు ఉన్నాయని.. అందులో ఒకటి పిక్ చేసుకోమని అడిగారని.. ఏ కథైతే తనకు సూట్ అవుతుందో అదే పిక్ చేసి చెప్పమని వివరించినట్లు తెలిపారు రామ్ చరణ్. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన మైండ్ లో ఒక కథ ఫిక్స్ అయి ఎప్రోచ్ అయ్యాడని.. కానీ మీకు ఏ జోనర్ చేయాలనుందని అడిగాడని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ సినిమా అంటే కచ్చితంగా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుందని అన్నారు చరణ్.
కేవలం ముగ్గురు క్యారెక్టర్స్ పెట్టుకొని 'జెర్సీ'అనే మంచి సినిమా తీశాడని.. అందుకే తనను నమ్మి ఎలాంటి కథ అనుకున్నాడో అదే చేద్దామని చెప్పినట్లు చరణ్ తెలిపారు. తమ కాంబోలో వస్తోన్న సినిమా స్పోర్ట్స్ డ్రామా కాదని.. వేరే జోనర్ సినిమా అని వెల్లడించారు. ఇక శంకర్ తో చేస్తోన్న సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందని దాని తరువాతే గౌతమ్ తో సినిమా ఉంటుందని అన్నారు.
ఇదే సమయంలో తన దీక్ష గురించి మాట్లాడారు. ఏడాదికి రెండు సార్లు అయ్యప్ప దీక్షలో ఉండడం అలవాటు చేసుకున్నానని.. అందుకే ఏడాది ఆరంభంలో, అలానే చివర్లో రెండు మాలలు వేస్తూ ఉంటానని అన్నారు. ఈసారి ఆరంభంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా వల్ల కుదరకపోవడంతో ఆలస్యంగా మాల ధరించానని తెలిపారు. తన మిత్రుడు ఎన్టీఆర్ ఎప్పటినుంచో ఆంజనేయ స్వామి మాల ధరించాలని అనుకున్నాడని.. ఫైనల్ గా ఇప్పుడు ఆ దీక్ష చేపట్టారని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
Also Read: 'హరిహర వీరమల్లు' - ఏ పండక్కి వస్తుందో?
Also Read: 'ఆచార్య' టీమ్ వారిద్దరినీ కావాలనే మర్చిపోయిందా?
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్స్టాప్?
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్పై బెంగళూరు ఘనవిజయం!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్గా నిఖత్ జరీన్!
KTR UK Tour: లండన్లోని కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం