Ram Charan: అకిరా నందన్ బర్త్ డే - రామ్ చరణ్ ట్వీట్ చూశారా?
రామ్ చరణ్.. అకిరాను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన మెగాఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ట్వీట్ ను షేర్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్ ఈరోజు 18వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు అకిరాకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. రేణుదేశాయ్ తన కొడుక్కి విషెస్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేయగా.. అది బాగా వైరల్ అయింది. ఇక తాజాగా రామ్ చరణ్.. అకిరాను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు.
'సంవత్సరాలు గడిచేకొద్దీ మన బంధం మరింత బలపడుతుంది.. లవ్ యు లోడ్స్.. హ్యాపీ బర్త్ డే' అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ చూసిన మెగాఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ట్వీట్ ను షేర్ చేస్తున్నారు. మరికొందరైతే.. అకిరాను హీరోగా లాంచ్ చేయమని రామ్ చరణ్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే అకిరాకు హీరో అవ్వాలని లేదని ఇప్పటికే రేణుదేశాయ్ పలు సందర్భాల్లో చెప్పింది.
ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి 'సర్కారోడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Also Read: అకిరా నందన్ పవర్‌ఫుల్ పంచ్ - హీరో మాత్రం అవ్వడంటున్న రేణుదేశాయ్
Also Read: రణబీర్ కపూర్ పెళ్లిలో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ హడావిడి?
Akira our bond becomes stronger with every passing year.. ❤️
— Ram Charan (@AlwaysRamCharan) April 8, 2022
Love you loads!!
Happy Birthday 🤗
Happy Birthday My little #Akira
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 8, 2022
I wish you loads of happiness,health,joy and laughter…love you so much…
All the best for your future endeavours whichever and whatever you wish for 🤗😘 pic.twitter.com/5eHjAX9Omp
View this post on Instagram