RRR Fights: ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫైట్.. మరి అభిమానులు ఏమనుకుంటున్నారు?
ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫైట్ సన్నివేశంపై అభిమానులు ఎలా ఫీలవుతున్నారు. రాజమౌళి సాహసం చేశారా?
హీరో.. విలన్‌ను కొడుతుంటే విజిల్స్ వేసి మరీ అభిమానులను ఎంకరేజ్ చేస్తారు. ఒక వేళ విలన్.. హీరోను కుమ్మేస్తుంటే తెగ బాధపడిపోతారు. కొందరైతే కోపంతో స్క్రీన్‌ను కూడా చించేస్తారు. కానీ, ఇద్దరు అభిమాన హీరోలు ఒకరినొకరు కొట్టుకుంటుంటే.. ఫాన్స్ ఊరుకుంటారా? ఆ సీన్‌ను ఊహించుకోవడమే కష్టం కదూ. ముఖ్యంగా నందమూరి, మెగా ఫ్యామిలీ స్టార్స్ మధ్య ఫైట్స్ అంటే అభిమానులు అస్సలు సహించలేరు. తమ అభిమాన హీరోదే పైచేయి కావాలని భావిస్తారు. పోట్లాటలు జరిగే ప్రమాదం కూడా ఉంది. అలాంటి సీన్ చేయాలంటే.. ఎంతో ధైర్యం ఉండాలి. అయితే, దర్శక ధీరుడు ఆ సాహసం చేశాడు. RRR మూవీలో ఇద్దరు పెద్ద హీరోలను కొట్టుకొనేలా చేశారు. ఆ సీన్లను ధైర్యంగా ట్రైలర్‌లో చూపించారు. మరి అభిమానులు ఊరుకుంటారా?
నందమూరి, మెగా ఫ్యామిలీలు ఎప్పుడు కలిసి పని చేయడం చూడలేదు. వీరు బయటకు స్నేహితులుగా కలిసి ఉన్నా.. వారి ఉన్న ఇమేజ్ వల్ల దర్శకులు ఎవరూ ఆయా హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ప్రయత్నించలేదు. కేవలం వారి వారి ఫ్యామిలీల్లోని హీరోలతోనే చిత్రాలు తీశారు. కానీ, ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే.. దగ్గుబాటి వెంకటేష్, రానాలతో కలిసి సినిమాలు చేశారు. అయితే, దగ్గుబాటి అభిమానులు ‘అందరివారు’ కావడంతో పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, నందమూరి, మెగా అభిమానులు మాత్రం వీర భక్తులు. తమ హీరోను ఇతర హీరోలతో ఏ మాత్రం తక్కువ చేసి చూపించినా సహించలేరు. అలాంటిది రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు సినిమా చేస్తున్నారని తెలియగానే.. ఒకింత షాకయ్యారు. రాజమౌళి తమ హీరోలను ఎలా చూపిస్తారనే ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ఇద్దరికీ సమాన హైప్ ఇస్తూ బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఇద్దరి హీరోలకు ఈ సినిమాలో ఫైట్ ఉంటుందని ముందే చెప్పేసి.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ముందే హింట్ ఇచ్చారు. దీంతో ఇరువురు అభిమానులు ట్రైలర్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు.
ఎట్టకేలకు గురువారం ట్రైలర్ విడుదలైంది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల మధ్య ఫైట్‌ను కూడా చూపించారు. ముందుగా చెప్పుకున్నట్లుగా హీరో విలన్‌ను కొడితే.. చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కానీ, మరో హీరో మన హీరోను కొట్టాడు. మన హీరో తన్నులు తింటున్నాడు.. హథవిధీ ఇది చూడగలమా? మన హీరో తన్నులు తింటే.. అవతలి హీరో అభిమానులు విజిల్స్ వేస్తే భరించగలమా? అనే అభిప్రాయం అభిమానుల్లో కలిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే, రాజమౌళి.. అభిమానులకు ఆ ఛాన్స్ ఇవ్వడనే అనిపిస్తుంది. ఎందుకంటే.. సినిమా ప్రారంభం కాగానే ప్రేక్షకులను సినిమాల్లో లీనమైపోయేలా చేస్తారు. ఆ తర్వాత కళ్ల ముందు కనిపించేది కేవలం భీమ్, రామ్ మాత్రమే. కాబట్టి.. అభిమానులు దీన్ని ఒక సినిమాలా చూస్తే పర్వాలేదు. మరీ వ్యక్తిగతంగా తీసుకుంటేనే కష్టం.
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
ఇందులో పాత్రపరంగా మాత్రమే ఫైట్ సన్నివేశం ఉంటుంది. బ్రిటీష్ పోలీస్ బాధ్యతల్లో ఉన్న రామ్.. విధి నిర్వహణలో భాగంగా భీమ్‌తో తలపడాల్సి వస్తుంది. భీమ్ పోరాటానికి చలించిన రామ్.. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుతాడు. సమర శంఖాన్ని పూరిస్తాడు. పైగా ఇందులో భీమ్, రామ్‌ను కొట్టడమే కాదు.. రామ్ కూడా భీమ్‌ను ఎగిరి తన్నే సన్నివేశం ఉంది. ఆ ఫైట్ చూసినప్పుడు.. తప్పకుండా అభిమానులకు కాస్త ఇబ్బందిగా ఉన్నా.. అక్కడి సన్నివేశాన్ని అర్థం చేసుకుని రాజీపడవచ్చు. అందుకే.. రాజమౌళి ఈ సాహసం చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత కొంతమంది అభిమానులు మాత్రం నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ కొట్టుకోవడం తమకు నచ్చలేదని అంటున్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు ఒక్కటైనా.. అభిమానులు మాత్రం ఒక్కటి కాలేకపోతున్నారు. ఇప్పటికీ.. వేర్వేరుగా పోస్టర్లు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. హీరోలు మారుతున్నారు.. మరి అభిమానులు మారరా?
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి