Ram Charan: రామ్ చరణ్ 'బంగారు' మనసు - 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి స్పెషల్ గిఫ్ట్స్
'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం పిలిచి వారందరికీ ఊహించని బహుమతి అందించారు రామ్ చరణ్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమాను మొత్తం ఐదొందల కోట్లతో నిర్మించారు. ఏడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం విశేషం. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడంతో టీమ్ మొత్తం ఆనందంలో ఉంది.
ఈ సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం పిలిచి వారందరికీ ఊహించని బహుమతి అందించారు రామ్ చరణ్. సినిమా కోసం పని చేసిన కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసిన అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా సుమారు 35 మందిని ఇంటికి పిలిచి.. వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్.. అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం గోల్డ్ కాయిన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.
అలానే ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి 'ఆర్ఆర్ఆర్' కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈరోజు రామ్ చరణ్ ముంబైకి వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో తీసిన ఆయన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్
Also Read: ప్రభాస్ 'ఊ' అంటాడా? 'ఊ ఊ' అంటాడా?
View this post on Instagram
View this post on Instagram