Rajkummar Rao: ఇల్లు కొంటానంటే.. షారుఖ్ ఆ సలహా ఇచ్చారు, జాన్వీ బంగ్లా కొనడానికి కారణం ఇదే: రాజ్‌కుమార్ రావ్
Rajkummar Rao: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ముంబైలో ఒక విలాసవంతమైన ఇంటిని కొన్నారు. అయితే, ఆ విల్లా కొనేందుకు షారూక్ ఖాన్ సలహా ఇచ్చారట. ఆయన వల్లే ఇల్లు కొన్నానని చెప్తున్నారు.
Rajkummar Rao Recalls Shah Rukh Khan Inspired Him: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు.. ఆయన నటించిన సినిమా 'శ్రీకాంత్' మే 10న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే, ఇటీవల రాజ్ కుమార్ ముంబైలో ఒక విలాసవంతమైన భవనాన్ని కొన్నారు. అది కూడా శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నుంచి ఆయన ఆ బిల్డింగ్ ని కొనుగోలు చేశారు. అయితే, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ ఆ బిల్డింగ్ గురించి, అది కొనడం గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.
ఆయన సలహాతోనే తీసుకున్నాను..
రాజ్ కుమార్ ఇటీవల ముంబైలో ఒక విలాసవంతమైన భవనాన్ని కొన్నారు. జాన్వీ కపూర్ నుంచి దాదాపు రూ.44 కోట్లకు ఆ ఇంటిని తీసుకున్నారు. జాన్వీ కపూర్ ఆ ఇంటిని 2022 డిసెంబర్ లో రూ.39 కోట్లకు కొనుగోలు చేసి, ఆ తర్వాత రూ.44 కోట్లకు అమ్మారు. అయితే, ఆ ఇంటి గురించి మాట్లాడుతూ.. “షారుక్ ఖాన్ సార్ నాకు ఎప్పుడూ ఒకటి చెప్తుండేవాళ్లు. బేటా ఎప్పుడైనా ఇల్లు కొనాలంటే నువ్వు ఎఫర్ట్ చేసే దానికంటే కొంచెం ఎక్కువ పెట్టి కొను. అప్పుడు నీకు సంపాదించాలనే ఆలోచన, హార్డ్ వర్క్ చేయాలనే ఉద్దేశం ఏర్పడతాయి అని చెప్పారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఆయన సలహాతోనే ఇల్లు కొన్నాను’’ అని చెప్పారు రాజ్ కుమార్.
3456 స్క్వేర్ ఫిట్స్ లో ఆ ఇల్లు ఎంతో విశాలంగా ఉంటుందని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. రాజ్ కుమార్ రావు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. కాగా ఆయన ఎప్పుడు తనకి షారుక్ ఖాన్ తనకు స్ఫూర్తి అని చెప్తుంటారు. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ నటిస్తున్న 'మిస్టర్ అండ్ మహీ' సినిమాలో రాజ్ కుమార్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ కుమార్ 2022లోనే ఆ ఇల్లు కొనుగోలు చేశారు.
సినిమాల్లో బిజీ బిజీ..
ప్రస్తుతం ఆయన నటించిన 'శ్రీకాంత్'. శ్రీకాంత్ బొల్లం అనే వ్యాపారవేత్త లైఫ్ స్టోరీ ఇది. ఆయనతో పాటు జ్యోతి, అలయా, శ్రద్ధ కేల్కర్ తదితరులు ఈ సినిమాలో నటించారు. మే 10న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇక ఆ తర్వాత 'స్ట్రీట్ - 2' అనే హారర్ కామెడీ సినిమాలో నటించారు ఆయన. అమర్ కౌశిక్ ఆ సినిమాకి డైరెక్ట్ చేశారు. శ్రద్ధ కపూర్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అప్రశక్తి ఖురానా తదితరులు 'స్ట్రీట్ - 2' లో కనిపించనున్నారు. వరుణ్ దావన్ ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నారు. ఇక వాటితో పాటు 'విక్కి విద్యా కా వూ వాలా' వీడియో అనే ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు రాజ్ కుమార్. దాంట్లో త్రిప్తి దిమ్రీ సరనస నటించనున్నారు.
Also Read: దండిగా ‘హీరామండి’ రెమ్యునరేషన్స్, దర్శకుడికి ఎంతిచ్చారో తెలిస్తే షాకే!