బెండకాయ చాలా మందికి ఇష్టమయ్యే ఆకుపచ్చని కూరగాయ. రుచికరమైన ఈ కాయగూరతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. బెండకాయలో విటమిన్లు C, K పుష్కలం. ఈ సూక్ష్మ పోషకాలు మాత్రమే కాదు, బెండకాయ ద్వారా ప్రొటీన్ కూడా అందుతుంది. బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు తగినన్ని ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. బెండకాయ గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ చికిత్స, నివారణలో బెండకాయ ఏ విధంగా ఉపయోగకరమనే విషయం గురించిన పరిశోధనలు సాగుతున్నాయి. బెండకాయతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహులు తప్పక తీసుకోవాల్సిన కూరగాయ. ఇందులో ఫోలెట్ పుష్కలంగా ఉంటుంది కనుక గర్భవతులకు చాలా మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.