వేసవిలో వేడి వల్ల నిద్రపట్టడం లేదా? ఈ ఫుడ్స్ తినండి పిస్తా పప్పులు నిద్రను ప్రేరేపిస్తాయి. ఇందులోని ప్రొటీన్, విటమిన్ బి6,మెగ్నీషియం ఉంటాయి. ఇవన్నీ నిద్రను పెంచుతాయి. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలో తింటే హాయిగా నిద్రించవచ్చు. అరటిపండ్లలోని మెగ్నీషియం, పొటాషియం, బి6 మంచి నిద్రకు ప్రేరేపిస్తాయి. ఇందులోని సెటోనిన్ కండరాలకు, నరాలకు మేలు చేస్తుంది. బాదం త్వరగా నిద్రించేందుకు సహాయపడతాయి. ఇందులో ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, కండరాలు నరాలను రిలాక్స్ చేస్తాయి. డార్క్ చాక్లెట్ కూడా నిద్రపోయేందుకు సహాయపడుతుంది. ఇందులోని సెరోటోనిన్ వంటి సమ్మేళనాలు నిద్రకు సహాయపడతాయి. నిద్రించే ముందు ఒక గిన్నె వోట్మీల్ తింటే ప్రశాంతమైన నిద్రపడుతుంది. అంజీర్ పండ్లలోని సమ్మేళనాలు మంచి నిద్రకు దోహదపడతాయి. చమోమిలే టీ అనేది ఒక క్లాసిక్ ఎంపిక. ఇది నరాలను శాంతపరిచి, నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. టార్ట్ చెర్రీస్ మెలటోనిన్ సహజ మూలం. కొంతమందికి మంచి నిద్రను అందిస్తుంది.