Rajinikanth Health Update: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తలైవర్ - ఏం ప్రమాదం లేనట్లే!
Rajinikanth: అనారోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు.
Rajinikanth Discharge: ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సెప్టెంబర్ 30వ తేదీన తలైవర్ రజనీకాంత్ తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. గుండెకు అనుసంధానం అయి ఉండే ప్రధాన రక్త నాళం బృహద్ధమనిలో సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఈ సమస్య కోసం ఆయన గుండెలో ఒక స్టంట్ వేశారు. అనంతరం ఆయన కండీషన్ స్టేబుల్ అయింది.
సినిమాల్లో బిజీగా తలైవర్
ప్రస్తుతం రజనీకాంత్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో 'జై భీమ్' డైరెక్టర్ టీఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన 'వేట్టయన్' సినిమా మొదటిది. అక్టోబర్ 10వ తేదీన దసరా కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో ‘వేట్టయన్: ది హంటర్’ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Also Read: దళపతి విజయ్ లాస్ట్ సినిమాలో విలన్‌గా 'యానిమల్' స్టార్ బాబీ డియోల్ - హీరోయిన్లుగా వాళ్లిద్దరూ?
ఈ సినిమాలో రజనీకి జోడీగా మలయాళ భామ, సీనియర్ హీరోయిన్ మంజూ వారియర్ నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలో ఆవిడ వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. టాలీవుడ్ మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు, 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
'వేట్టయన్' కాకుండా 'విక్రమ్', 'ఖైదీ', 'మాస్టర్', 'లియో' సినిమాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజనీకాంత్ 'కూలీ' సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఉంది. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలన్నది ప్లాన్. రజనీ కోలుకున్న తర్వాత మళ్లీ ‘కూలీ’ షూటింగ్ ప్రారంభిస్తారు. హీరో అవసరం లేని సన్నివేశాలను అప్పటి వరకూ షూట్ చేయడానికి లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
— Rajinikanth (@rajinikanth) October 4, 2024
நான் விரைவில் குணமடைய வேண்டும் என்று மனதார வாழ்த்திய தமிழக எதிர்க்கட்சி தலைவர் நண்பர் @EPSTamilNadu திரு.எடப்பாடி பழனிசாமி அவர்களுக்கு எனது மனமார்ந்த நன்றி 🙏🏻
— Rajinikanth (@rajinikanth) October 4, 2024
நான் மருத்துவமனையில் இருக்கும்போது, எனது நலன் விசாரித்து, நான் சீக்கிரம் குணமடைய வாழ்த்திய, எனது அருமை நண்பர் தமிழக முதலமைச்சர் மாண்புமிகு @mkstalin மு.க.ஸ்டாலின் அவர்களுக்கு எனது மனமார்ந்த நன்றிகளை தெரிவித்துக்கொள்கிறேன் 🙏🏻
— Rajinikanth (@rajinikanth) October 4, 2024
My dear honourable Prime Minister Shri @narendramodi ji … my heartfelt thanks to you for your care and concern regarding my health and checking on me personally 🙏🏻
— Rajinikanth (@rajinikanth) October 4, 2024