అన్వేషించండి

Rahul Ramakrishna: ఆ హీరోలపై రాహుల్ రామకృష్ణ షాకింగ్ కామెంట్స్.. ట్వీట్ వైరల్

నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందో..

కామెడీ పాత్రలతోపాటు.. భావోద్వేగ సన్నివేశాలతో తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. అతడు వేసే డైలాగులు.. మాట తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. టాలీవుడ్‌లో విడుదలయ్యే దాదాపు అన్ని సినిమాల్లో రాహుల్ రామకృష్ణ కనిపిస్తున్నాడు. అలాగే, కథలో ప్రాధాన్యమున్న పాత్రలో కూడా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల ‘జాతిరత్నాలు’ సినిమాతో కూడా రాహుల్ మంచి క్రేజ్ సంపాదించాడు. అయితే, అలాంటి నటుడు.. ‘బ్యాక్‌గ్రౌండ్’ కలిగిన నటులపై బూతు వ్యాఖ్యలు చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. అయితే, అతడు అదే చేశాడు. తనకు ఎదురైన చేదు అనుభవాల వల్ల ఆ వ్యాఖ్యలు చేశాడో లేదా తన సినిమా ‘నెట్’ విడుదల సందర్భంగా పబ్లిసిటీ కోసం అలా మాట్లాడాడో తెలీదుగానీ.. అతడి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 

రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ‘NET’ సినిమా ఈ నెల 10వ తేదీన ‘ZEE 5’ ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో రాహుల్.. పోర్న్ వీడియోలకు బానిసైన వ్యక్తిలా కనిపిస్తాడు. అవికా గోర్ ఇంట్లో రహస్య కెమేరాలు పెట్టి.. ఆ వీడియోలను ప్రసారం చేసే ఓ డార్క్ వెబ్‌సైట్‌‌లో రిజిస్టర్ అవుతాడు. అప్పటి నుంచి అవికా గోర్.. ప్రైవేట్ లైఫ్‌ను మోబైల్‌లో చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. ఈ సందర్భంగా అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లు.. ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందనే నమ్మకం కలిగించాయి. 

అయితే, రాహుల్ రామకృష్ణ ఈ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి మా సినిమా భయపడదని, మా సినిమాకు గు*లో దమ్ము ఉందని పేర్కొన్నాడు. రెండోసారి చేసిన ట్వీట్‌లో ‘‘మా సినిమాకు గు*లో దమ్ము ఉంది’’ అని పేర్కొన్నాడు. రాహుల్ రామకృష్ణ ఎవరినైనా టార్గెట్ చేసుకున్నాడా ? లేదా ఫ్రస్ట్రేషన్‌తో ఆ ట్వీట్ చేశాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాగిన మైకంలో ట్వీట్ చేసి ఉంటాడని పలువురు నెటిజనులు అంటున్నారు. తనను ట్రోల్ చేస్తున్న నెటిజనులు ఉద్దేశిస్తూ.. ‘‘ట్విట్టర్లో అంతా పతీతులే అన్నమాట’’ అంటూ మరో ట్వీట్ చేశాడు. 

‘‘రాహుల్ నీ మీద మాకు ఎంతో అభిమానం ఉంది. సినిమా పబ్లిసిటీ కోసం మరీ అంతగా దిగజారిపోవద్దు’’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వినాయక చవితి పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అదే రోజున నాని నటించిన ‘టక్ జగదీష్’, నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. టక్ జగదీష్‌ను అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల చేస్తుంటే.. ‘లవ్ స్టోరీ’ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే, ‘లవ్ స్టోరీ’ సినిమాను వాయిదా వేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. 

రాహుల్ సినిమా బ్యాక్ గ్రౌండ్ కలిగిన హీరోలతో కూడా పనిచేశాడు. ఆ చిత్రాల ద్వారా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అతడి టాలెంట్‌కు అదృష్టం కూడా తోడు కావడంతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, ఈ ట్వీట్‌తో రాహుల్ కష్టాల్లో పడతాడనే అభిప్రాయం నెలకొంది. ఒక వేళ ఈ ట్వీట్ పబ్లిసిటీ స్టంట్ అనుకున్నా.. ఆ హీరోలకు అది ఇబ్బందికరంగానే ఉంటుంది.   

Read Also: ‘నెట్’ ట్రైలర్: గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్.. బోల్డ్ సీన్స్‌లో రాహుల్ రామకృష్ణ

Read Also: అక్కినేని ‘లవ్‌ స్టోరీ’.. నాగ్-అమలను కలిపింది రామానాయుడే! కింగ్‌ను భయపెట్టిన కిస్

 

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : ఓటీటీలోకి సడన్‌గా రోజా తమిళ క్రైమ్ థ్రిల్లర్ - గ్యాప్ తర్వాత కీ రోల్‌లో సీనియర్ హీరోయిన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సడన్‌గా రోజా తమిళ క్రైమ్ థ్రిల్లర్ - గ్యాప్ తర్వాత కీ రోల్‌లో సీనియర్ హీరోయిన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ranabaali Review - 'రణబాలి' రివ్యూ: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం... సినిమా హిట్టా? ఫట్టా?
'రణబాలి' రివ్యూ: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం... సినిమా హిట్టా? ఫట్టా?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Campus Drivers Series OTT : ఓటీటీలోకి సరికొత్త లవ్ రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త లవ్ రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Embed widget