అన్వేషించండి

One Year for Pushpa Movie: ‘పుష్ప’ మూవీకి ఏడాది, ఇంట్రెస్టింగ్ పిక్ పోస్ట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్

‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. గతేడాది డిసెంబర్ 2021 న విడుదల అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

గతేడాది టాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో ‘పుష్ప ది రైజ్’ ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అంటూ పుష్పరాజ్ క్యారెక్టర్ లో బన్ని చేసిన యాక్టింగ్, ఫైట్స్, డాన్స్, డైలాగ్స్ కు యావత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప ది రూల్’ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా విడుదల అయి యేడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల ‘పుష్ప’ టీమ్ తో రష్యా టూర్ లో భాగంగా దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇలాంటి గొప్ప సినిమా సక్సెస్ లో తనకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు ‘పుష్ప’ టీమ్ కు ధన్యవాదాలు తెలియజేశారు దేవి.

దర్శకుడు సుకుమార్, బన్నీది సూపర్ హిట్ కాంబినేషన్. ‘ఆర్య’ సినిమాతో బన్ని సినిమా కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మైలు రాయిని చేశారు సుకుమార్. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్య 2’ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ‘ఆర్య 2’ ఆల్బమ్ ఆ యేడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ నిలిచింది. ఇప్పటికీ ఆ పాటలు చాలా మంది ప్లే లిస్ట్ లో ఫేవరేట్ సాంగ్స్ గా ఉంటాయి. దాదాపు పదేళ్ల తర్వాత ‘పుష్ప’ కోసం మళ్లీ వీరిద్దరూ కలిశారు. ‘పుష్ప’ కథను ముందు మహేష్ బాబు కు చెప్పారట. ఆయన ఓకే చెప్పినా డేట్లు సర్దుబాటు కాకపోవడంతో కుదరలేదు. అయితే మహేష్ కు చెప్పిన స్టోరీ లైన్ వేరట. 

ఇక అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కలిస్తే సౌండ్ బాక్సులు బద్దలు కావాల్సిందే. అందుకు వారి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలే ఉదాహరణ. ఈ ‘పుష్ప1’ లో పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. మొదట్లో ఈ పాటలకు యావరేజ్ టాక్ వచ్చినా సినిమా రిలీజ్ అయిన తర్వాత నేషనల్ లెెవల్ లో హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లి’, ‘సామి సామి’ పాటలు సోషల్ మీడియాలో సన్సేషన్ క్రియేట్ చేశాయి. అంతే కాదు 2022 లో అత్యంత ఆదరణ పొందిన టాప్ 10 పాటల్లో ఈ పాటలు కూడా చోటు దక్కించుకున్నాయి. అంత సూపర్ హిట్ అయ్యాయి ఈ సాంగ్స్. 

గతేడాది డిసెంబర్ లో విడుదల అయిన ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 365 కోట్లు వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఒక్క హిందీలోనే ఈ సినిమా 108 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2021 లో అధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటి గా నిలిచింది ‘పుష్ప’. తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అంతే కాదు ఈ సినిమాకు అవార్డులు కూడా అదే స్థాయిలో వచ్చాయి.

ప్రస్తుతం ‘పుష్ప ది రైస్’ కు కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ రానుంది. మొదటి పార్ట్ లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడో చూపించారు. ఇప్పుడు రెండో భాగంలో తనకు శత్రువులైన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్, మంగళం శీను, జాలి రెడ్డి, దాక్షాయిని ల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని పుష్పరాజ్ ఎలా ఎదుర్కొని ముందుకెళ్లాడు వంటి అంశాలను తెరపై చూపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలైంది. వచ్చే యేడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఇప్పుడు రష్యాలో కూడా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అక్కడికి వెళ్లి వచ్చింది. ‘పుష్ప’ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్.. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

Also Read: నా పెళ్లి గురించి అడిగితే అతని తర్వాతే అని చెప్పాలేమో - అన్‌స్టాపబుల్ ప్రభాస్, గోపీచంద్ ప్రోమో వచ్చేసింది!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Kickboxing: తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Embed widget