అన్వేషించండి
Advertisement
Pushpa: అల్లు అర్జున్ మాసివ్ రికార్డ్ - 'పుష్ప' ఆల్బమ్‌కి 5 బిలియన్ వ్యూస్!
'పుష్ప' మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట.
2021 డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. సినిమా స్టార్స్, క్రికెటర్స్ ఇలా చాలా మంది 'పుష్ప' సాంగ్స్ కి డాన్స్ చేస్తూ.. సినిమాలో డైలాగ్స్ చెబుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు. 'తగ్గేదేలే' అనే డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సినిమా విడుదలై ఇంత కాలమవుతున్నా.. ఇప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఈ సినిమా పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
'పుష్ప' మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచిన పుష్ప ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది. దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా, ఊ అంటావా ఊఊ అంటావా పాటలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది. అలాగే సోషల్ మీడియా రీల్స్‌లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పుష్ప సినిమాలోని ప్రతీ విషయం కూడా ప్రేక్షకులకు అడిక్షన్‌లా మారిపోయింది. ప్రతీ పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది పుష్ప మ్యూజిక్ ఆల్బమ్. దీనికి ముందు అల వైకుంఠపురములో సినిమా కూడా మ్యూజికల్‌గా సంచలనాలు సృష్టించింది. 'పుష్ప' కూడా అదే కంటిన్యూ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 రాబోతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
కర్నూలు
ఆట
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion