అన్వేషించండి

Dil Raju: మూవీ రివ్యూ నేను రాస్తానంటున్న దిల్‌ రాజు - 'రేవు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత ఒపెన్ స్టేట్‌మెంట్!

Dil Raju Comments: స్టార్‌ నిర్మాత దిల్‌ రాజు మూవీ రివ్యూ రాస్తానంటున్నారు. 'రేవు' మూవీ ట్రైలర్‌ లాంచ్‌లో ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ సినిమా చూసి తానే రివ్యూ రాస్తానంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Dil Raju Speech At Revu Movie Trailer Launch Event: ఇప్పటి వరకు సినిమాలకు జర్నలిస్టులు రివ్యూలు రాయడం చూశాం. కానీ, ఇప్పుడు ఓ స్టార్ ప్రొడ్యూసర్ సినిమాకు రివ్యూ రాబోతోన్నారు. ప్రొడ్యూసర్ సినిమాకు రివ్యూ రాయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఓ ట్విస్టు ఉంది. ఇద్దరు సినీ జర్నలిస్టులు ‘రేవు‘ అనే సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆగష్టు 23న ‘రేవు‘ విడుదల

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో ‘రేవు‘ మూవీ తెరకెక్కింది. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌ గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో దిల్ రాజు చీఫ్ గెస్టుగా పాల్గొన్నారు.

‘రేవు’ సినిమాకు నేను రివ్యూ రాస్తా- దిల్ రాజు

ఇక ట్రైలర్ లాంఛ్ వేడుకలో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత వరకు వీళ్ళు(ప్రభు, రాంబాబు) సినిమాని చూసి రివ్యూ రాశారని.. ఇప్పుడు తాను ఈ సినిమా చూసి రివ్యూ రాస్తానని వెల్లడించారు. “కొత్త వాళ్లు.. కొత్త వాళ్లతో ప్రయోగం చేస్తూనే ఉంటారు. కానీ 99 శాతం ఫెయిల్యూర్. వన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది. మురళీ వంటి వారు కొత్త వాళ్లతో సినిమాను చేశారు. ప్రభు, పర్వతనేని రాంబాబు ఈ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మేం ఇక్కడకు వచ్చాం. ఇలాంటి సినిమాను తీయడం గొప్ప కాదు. ప్రేక్షకులను థియేటర్ వరకు తీసుకు రావడం గొప్ప. ‘రేవు’ కాన్సెప్ట్ బాగుంది. రాంబాబు, ప్రభు నాకు చాలా మంచి సన్నిహితులు. వారు ఈ చిత్రం గురించి చెప్పారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నాను. చిన్న సినిమా అని వదిలేయకండి. థియేటర్ కి వెళ్లి చూడండి. నిజానికి ఆడియెన్స్ ను మేమే చెడగొట్టాం. ఇంట్లోనే ఉండండి, 4 వారాల్లో సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం చేశాం. కానీ, సినిమాను థియేటర్లలో చూస్తే వచ్చే అనుభూతి బాగుంటుందని గుర్తించాలి” అని దిల్ రాజు వెల్లడించారు.   

Read Also: ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సుధీర్ బాబు- మెస్మరైజ్ చేస్తున్న ‘జటాధార‘ ఫస్ట్ లుక్

Read Also: ‘ఛాంపియన్‘ సినిమా షూటింగ్ షురూ- క్లాప్ కొట్టిన నాగ్ అశ్విన్, హీరో ఎవరంటే!

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget