అన్వేషించండి

Jatadhara First Look: ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సుధీర్ బాబు- మెస్మరైజ్ చేస్తున్న ‘జటాధార‘ ఫస్ట్ లుక్

Sudheer Babu News | నవదళపతి సుధీర్ బాబు హీరోగా, వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జటాధార‘. తెలుగు, హిందీలో భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది మహాశివరాత్రికి విడుదలకానుంది.

Jatadhara Movie First Look Unveiled: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు, వెంకట్ కల్యాణ్ కాంబోలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెరకెక్కబోతోంది. ‘జటాధార‘ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో త్రిశూలం చేతిలో పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పండు వెన్నెలలో శివుడి ఫోటో ముందు నిల్చొని ఆకట్టుకుంటున్నారు. ప్రేరణ అరోరా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న‘జటాధార‘  

‘జటాధార‘ సినిమా పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కబోతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునేలా యూనిక్ కథాశంతో ఈ చిత్రం రూపొందనుంది. పాంటసీ కథాశంతో ఈ సినిమాను వెంకట్ కల్యాణ్ తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. శివుడి అతీత శక్తులతో సుధీర్ బాబు ఈ చిత్రంలో పవర్ ఫుల్ గా కనిపించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఫీమేల్ లీడ్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు హీరోయిన్ తో చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు తను చాలా ఆసక్తిగా కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

‘జటాధార‘పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు    

‘రుస్తుం‘, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ‘, ‘ప్యాడ్ మ్యాన్‘, ‘పరి‘ లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన స్టార్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా ఈ సినిమా నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె నిర్మించిన సినిమాలు కమర్షియల్ లా మంచి సక్సెస్ సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆమె నిర్మాతగా ‘జటాధార‘ రూపొందుతుండటంతో దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudheer Babu (@isudheerbabu)

త్వరలో షూటింగ్ ప్రారంభం, శివరాత్రికి సినిమా విడుదల

ఇప్పటికే ‘జటాధార‘ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఆయా సంస్కృతుల ఆధారంగా తెరకెక్కిన ‘ముంజియా’, ‘స్త్రీ’, ‘కాంతార’ మాదిరిగానే ఈ సినిమాను కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పురాణాలు, అతీంద్రియ అంశాలను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించబోతున్నారు. గతంలో ఏ సినిమాలో టచ్ చేయని అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ ప్రతిష్టాత్మ చిత్రం ‘జటాధార’ వచ్చే ఏడాది(2025) శివరాత్రి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా రూపొందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

రీసెంట్ గా సుధీర్ బాబు ‘హరోం హర‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ సినిమాను జ్ఞానసాగర్ తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తొలి షో నుంచి మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగానూ నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ‘జటాధార’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  

Read Also: ప్రభాస్‌-హను రాఘవపూడి సినిమా స్టార్ట్‌ - సైలెంట్‌గా పూజా కార్యక్రమం జరిపించిన టీం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Haryana Polls: 'ఆప్' నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
AAP నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశుడికి  280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
ఖైరతాబాద్‌ గణేశుడికి 280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
KTR: సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
Delhi Liquor Case  : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి   బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
Embed widget