అన్వేషించండి

Dil Raju: ‘బలగం’ బూస్టింగ్​తో కీలక నిర్ణయం, త్వరలో కొత్త న్యూస్ చెప్పబోతున్నట్లు దిల్ రాజు వెల్లడి

ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో కొత్త న్యూస్ చెప్పబోతున్నట్లు వెల్లడించారు. ఆ న్యూస్ విని అందరూ తనను అభినందిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఇంతకీ ఆయన చెప్పబోయే న్యూస్ ఏంటా? అని ఆలోచిస్తున్నారు.

Dil Raju About Janaka Aithe Ganaka Movie : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నట్లు తెలిపారు. ఆ విషయం బయటకు తెలిశాక అందరూ తనని అభినందిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. ‘జనక అయితే గనక’ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.  వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై  హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.  సందీప్‌ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది. ఇప్పటి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పోస్టర్లు, పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచాయి.

‘బలగం’ బూస్టింగ్ తో కొత్త సినిమాలను ప్రోత్సహిస్తున్నా- దిల్ రాజు

‘బలగం’ సినిమా తర్వాత కొత్త సినిమాలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు దిల్ రాజు తెలిపారు. “నేను నిర్మాతగా ఎదగాలి అనుకున్నప్పుడు కొత్త కాన్సెప్టులు, కొత్త డైరెక్టర్లను ఎంచుకునేవాడిని . కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాను. నిర్మాతగా ఎదిగిన తర్వాత పెద్ద స్టార్లు, పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేయాల్సి వచ్చింది. పెద్ద వారితో పాటు నేను పెద్దవాడిగా మారాను. కింది స్థాయి వాళ్లకు అందుబాటులేకుండా పోయాను.  ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే సంస్థను ప్రారంభించి మళ్లీ చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నాం. ‘బలగం’ ఇచ్చిన బూస్టింగ్ తో కొత్త డైరెక్టర్లకు, కొత్త యాక్టర్లకు అవకాశం ఇస్తున్నాం. త్వరలో కొత్త న్యూస్ ఇవ్వబోతున్నాను. అప్పుడు మీరు ఇంకా అభినందిస్తారు అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.

‘కొత్త బంగారులోకం’ సక్సెస్ రిపీట్ అవుతుంది- దిల్ రాజు

‘జనక అయితే గనక’ సినిమాను రీసెంట్ గా చిన్న సినిమాలు తెరకెక్కించిన పలువురు దర్శకులు చూసి రివ్యూ ఇచ్చారని దిల్ రాజు వెల్లడించారు. “ఒక్కో డైరెక్టర్ ఆలోచించే విధానం ఒక్కోలా ఉంటుంది. ’35 చిన్నకథ కాదు’, ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’, ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాల దర్శకులు ఈ సినిమా చూశారు. అందరూ బాగుందని చెప్పారు. కొంత ఫీడ్ బ్యాక్ ఇచ్చినా, ఈ సినిమాలో మార్పులు ఏమీ చేయలేదు. ఈ సినిమా ‘కొత్తబంగారు లోకం’ సినిమాలా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమాను 20 నుంచి 30 ఏండ్ల లోపు వాళ్లు ఎక్కువగా ఇష్టపడుతారు. పెద్దవాళ్లు కూడా ఈ సినిమాను ఇష్టబడుతారు” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. 

సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాం- దిల్ రాజు

“ఇప్పటికే మా సినిమాను చాలా మందికి షో వేశాం. త్వరలోనే మీడియాకి కూడా షో వేస్తాను. మీడియా ముందుగా షో వేయాలంటే కాస్త భయంగానే ఉంటుంది. కానీ, మంచి సినిమా కాబట్టి.. మీడియాకు ముందుగానే షో వేస్తాం. ‘హ్యాపీ డేస్’, ‘శతమానం భవతి’ చిత్రాలను ఓవర్సీస్‌లో ముందుగా రిలీజ్ చేశాను. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు కూడా ఈ మూవీని అక్టోబర్ 10న ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తున్నాను. 11న ఇక్కడ ప్రీమియర్లు వేసి.. 12న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం. నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. అందరినీ అలరిస్తుంది” అని చెప్పుకొచ్చారు.  

Read Also: 43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్ళికి రెడీ అయిన ఫైర్ బ్రాండ్.. ముగ్గురు పిల్లలకు తల్లి - మూడు పెళ్ళిళ్ళు పెటాకులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Fake PM Kisan Yojana App: ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!
Embed widget