News
News
X

Prabhas New Movie : అవును, బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా - కన్ఫర్మ్ చేసిన ప్రొడ్యూసర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. బాలీవుడ్ దర్శకుడితో ఆయన సినిమా చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చేశారు.

FOLLOW US: 
Share:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కొత్త సినిమా గురించి ప్రొడ్యూసర్ ఓ కబురు చెప్పారు. బాలీవుడ్ దర్శకుడితో మన బాహుబలి సినిమా చేయనున్నారని చెప్పారు. ఎవరితో ప్రభాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
 
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో...హిందీ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ అండ్ న్యూ ఏజ్ యాక్షన్ ఫిల్మ్స్ దర్శకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) పేరు తెచ్చుకున్నారు. హృతిక్ రోషన్, కట్రీనా కైఫ్ జంటగా నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' తర్వాత ఐదేళ్ళు విరామం తీసుకున్నారు. 'వార్'తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ హీరోగా 'పఠాన్' తీసిన దర్శకుడు కూడా ఆయనే.
 
'అన్‌స్టాపబుల్‌ 2'లో కన్ఫర్మ్ చేసిన నిర్మాత!
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఓ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. కొన్ని రోజులుగా ఈ న్యూస్ వినబడుతోంది. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్‌ 2'కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి వచ్చారు. వాళ్ళను ప్రభాస్ సినిమా గురించి బాలకృష్ణ అడగ్గా... కన్ఫర్మ్ చేశారు.
 
''ప్రభాస్ గారు, హిందీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నాం. సల్మాన్ ఖాన్ హీరోగా కూడా ఒక సినిమా ప్లానింగులో ఉంది'' అని నవీన్ యెర్నేని తెలిపారు. 

హృతిక్ 'ఫైటర్' తర్వాతేనా?
షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'పఠాన్' ఈ నెల 25న విడుదల కానుంది. దీని తర్వాత అతడు చేయబోయే సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యింది. 'వార్' లాంటి సూపర్ డూపర్ హిట్ తీసే అవకాశం ఇచ్చిన హృతిక్ రోషన్ కథానాయకుడిగా 'ఫైటర్' తీయడానికి సిద్ధార్థ్ ఆనంద్ రెడీ అవుతున్నారు. అందులో దీపికా పదుకోన్ కథానాయిక. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఫిల్మ్ సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 'ఫైటర్' కంప్లీట్ అయ్యేలోపు ప్రభాస్ మూడు సినిమాలు పూర్తి చేయాలి. 

Also Read : వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య... పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు భారీ సినిమాలు ఉన్నాయి. 'ఆదిపురుష్'  సినిమాను తొలుత ఈ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నా... వీఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసం వాయిదా వేశారు. అది కాకుండా 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' చేస్తున్నారు. అది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్. రెండు భాగాలుగా విడుదల కానుంది. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా సెట్స్ మీద ఉంది. అది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఒకటి చేస్తున్నారు. 

Also Read : విలన్‌కు హీరోయిన్‌ ఛాన్స్‌ - బాలకృష్ణ ప్రామిస్

ఇప్పుడు ప్రభాస్ అంగీకరించిన సినిమాలు అన్నీ సెట్స్ మీద ఉన్నాయి. వీటి తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ సినిమా స్టార్ట్ అవుతుంది. దీనిపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 'సలార్', 'ప్రాజెక్ట్ కె' ఎప్పుడో స్టార్ట్ చేయడం వల్ల త్వరలో షూటింగ్ కంప్లీట్ అవుతాయి. మారుతి ఫాస్టుగా సినిమా తీసే దర్శకుడు. ఆయన కూడా కంప్లీట్ చేస్తారు.

Published at : 14 Jan 2023 09:01 AM (IST) Tags: Mythri Movie Makers Prabhas Unstoppable 2 Naveen Yerneni Siddharth Anand

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

టాప్ స్టోరీస్

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?