News
News
X

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్?

ప్రభాస్ సినిమాలో కరీనా కపూర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారట.

FOLLOW US: 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవల ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేశారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగశ్విన్ తో కలిసి 'ప్రాజెక్ట్ కె' వంటి సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. 

దీనికి 'స్పిరిట్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 'ఆదిపురుష్' సినిమాను నిర్మిస్తోన్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ ను కూడా టేకప్ చేశారు. ప్రభాస్ కెరీర్ లో మైల్ స్టోన్ 25వ సినిమాగా 'స్పిరిట్' మొదలుకానుంది. ఈ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటించబోతుందట. 

దీనికోసం ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని చెబుతున్నారు. ఏకంగా రూ.17 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. నిజానికి ప్రస్తుతం ఆమెకి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు. ఇలానే సమయంలో అంత రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెని ప్రభాస్ సినిమాలో తీసుకుంటారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై 'స్పిరిట్' టీమ్ రియాక్ట్ అవుతుందేమో చూడాలి!

'స్పిరిట్' కథ ప్రకారం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. తొలిసారి ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపించబోతుండడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి 'యానిమల్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ప్రభాస్ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ప్రభాస్ కాల్షీట్స్ ను బట్టి రెగ్యులర్ షూటింగ్ ప్లానింగ్ చేయనున్నారు. 

View this post on Instagram
 
A post shared by Prabhas (@actorprabhas)

Published at : 07 Jul 2022 03:02 PM (IST) Tags: Prabhas Kareena Kapoor Sandeep reddy vanga t series

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!