News
News
X

Prabhas: ప్రభాస్ డ్యూయల్ రోల్ - ఫ్యాన్స్‌కు పండగే!

మారుతి డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడట.  

FOLLOW US: 
 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న, చేయబోతున్న సినిమాల లైనప్ ఓ రేంజ్‌లో ఉంది. 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తూ... 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో సినిమాను ప్రభాస్ ఓకే చేశారు. మారుతి(Maruthi) దర్శకత్వంలో పని చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 

Prabhas's Playing Young and the Old: 'రాజా డీలక్స్' అనే పేరుని సినిమా టైటిల్ గా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడట. అందులో ఒకటి ఓల్డ్ గెటప్ కాగా.. మరొకటి యంగ్ రోల్ అని తెలుస్తోంది. తాతమనవళ్లుగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో కథ నడుస్తుందట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు మాళవిక మోహనన్ కాగా.. మరొకరు నిధి అగర్వాల్. మూడో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ లేదు.

ఇప్పటివరకు మారుతి మీడియం బడ్జెట్ సినిమాలు, మిడ్ రేంజ్ హీరోలతోనే సినిమాలు చేశారు. అలాంటిది ప్రభాస్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయగలరా.. అనే సందేహాలు కలిగాయి. మారుతి కూడా తనదైన స్టయిల్ లో ఓ హారర్ కామెడీ కథ రాసుకున్నారు. హారర్ సినిమాలకు కాలం చెల్లిన ఈ రోజుల్లో ప్రభాస్ తో అలాంటి సినిమా ఎందుకు చేయాలనుకున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్-మారుతి సినిమా కథ మొత్తం మారిపోయిందట.

హారర్ కామెడీ కాదు.. క్రైమ్ కామెడీ:
ఇది హారర్ సినిమా కాదు. ఓ క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా కథను రాసుకున్నారట. వజ్రాల దోపిడీ మెయిన్ ప్లాట్ గా సినిమా సాగుతుందట. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం కూడా కథలో మార్పులు చోటు చేసుకోవడమేనని చెబుతున్నారు. హారర్ కామెడీను కాస్త క్రైమ్ కామెడీగా మార్చేశారు. 

News Reels

కీలకపాత్రలో సంజయ్ దత్:
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt)ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే దర్శకనిర్మాతలు సంజయ్ దత్ తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ ను విలన్ రోల్ కోసం సంప్రదిస్తున్నారా..? లేక మరేదైనా పాత్రా..? అనే విషయంలో క్లారిటీ లేదు. 
 
ఈ మధ్యకాలంలో సంజయ్ దత్ కి విలన్ గా ఆఫర్స్ బాగా ఎక్కువయ్యాయి. 'కేజీఎఫ్2' సినిమాలో కూడా ఆయన విలన్ గా కనిపించారు. రీసెంట్ గా దళపతి విజయ్ సినిమాలో ఆయన్ను విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. దానికి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. మరి ప్రభాస్ సినిమాలో నటించడానికి ఈ నటుడు ఎంత డిమాండ్ చేస్తారో చూడాలి..!
  
Also Read : 'కాంతార' రివ్యూ : ప్రభాస్ మెచ్చిన కన్నడ సినిమా ఎలా ఉందంటే?

Published at : 15 Oct 2022 04:36 PM (IST) Tags: Malavika Mohanan Nidhi Agarwal Maruthi Prabhas

సంబంధిత కథనాలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam