News
News
X

Salaar: 'సలార్' సెట్స్ నుంచి వీడియో లీక్ - వైరల్ చేస్తోన్న ఫ్యాన్స్!

ప్రభాస్ 'సలార్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్పాట్ నుంచి ఓ వీడియో లీకైంది.

FOLLOW US: 
 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న యాక్షన్ ఎంటర్‏టైనర్ 'సలార్'(Salaar). ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 

ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణంరాజు మరణించారు. ఆయన మరణం ప్రభాస్ ని ఎంతగానో బాధిస్తుంది. కొంతకాలంపాటు ఆయన షూటింగ్ కి హాజరయ్యే పరిస్థితి లేదు. దీంతో మేకర్స్ షూటింగ్ వాయిదా వేసుకోవాలేమోనని అనుకున్నారు. కానీ నిర్మాతలు ఇబ్బంది పడకూడదని ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం మొత్తం 12 సెట్లు వేశారు. ప్రతీ సెట్ లోనూ రెండు, మూడు రోజులు మాత్రం షూటింగ్ చేస్తారట. కానీ సెట్ లు వేయక తప్పలేదు. ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

అయితే ఇప్పుడు షూటింగ్ స్పాట్ నుంచి ఒక వీడియో బయటకొచ్చింది. ఇందులో ప్రభాస్ పై ఓ సీన్ షూట్ చేస్తున్నారు. ప్రభాస్ నుంచొని సీరియస్ గా ఒక లుక్ ఇచ్చే సీన్ అది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని సర్క్యూలేట్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ తన మాస్ అండ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు.  

ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్:
కథ ప్రకారం.. ఈ సినిమాకి ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా కీలకం. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అయ్యేలా డిజైన్ చేయాలనుకున్నారు. ఇప్పటికే ఇంటర్వెల్ సీన్స్ కి సంబంధించిన షూటింగ్ ను నిర్వహించారు. అయితే ఆ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో రాలేదని మరోసారి రీషూట్ చేశారట. 'సలార్' విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 28, 2023లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరిన్ని సినిమాలు ఒప్పుకున్నారు. ఇప్పటికే 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారు. మరోపక్క నాగ్ అశ్విన్ డైరెక్ట్ డైరెక్ట్ చేస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.    

Also Read : బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానా నాయుడు' టీజర్ రిలీజ్

Also Read : లక్ష్మీ మంచు ఈజ్ బ్యాక్ - త్వరలో 'షెఫ్ మంత్ర 2' షురూ!

Published at : 24 Sep 2022 03:25 PM (IST) Tags: Salaar Prabhas Prabhas Salaar movie Salaar Leaked video

సంబంధిత కథనాలు

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?

Mahesh Babu New Cafe: మహేష్ - నమ్రతాల రెస్టారెంట్ పేరు ఇదే, ఈ బిజినెస్ ప్రత్యేకతలేమిటో తెలుసా?

Mahesh Babu New Cafe: మహేష్ - నమ్రతాల రెస్టారెంట్ పేరు ఇదే, ఈ బిజినెస్ ప్రత్యేకతలేమిటో తెలుసా?

Mukhachitram Review - 'ముఖచిత్రం' రివ్యూ : సినిమా చూశాక ప్రేక్షకుల ముఖచిత్రాలు ఎలా ఉంటాయంటే?

Mukhachitram Review - 'ముఖచిత్రం' రివ్యూ : సినిమా చూశాక ప్రేక్షకుల ముఖచిత్రాలు ఎలా ఉంటాయంటే?

Akshay Kumar Home Tour: ముంబైలోని అక్షయ్ కుమార్ ఇల్లు చూస్తే, వావ్ అనాల్సిందే!

Akshay Kumar Home Tour: ముంబైలోని అక్షయ్ కుమార్ ఇల్లు చూస్తే, వావ్ అనాల్సిందే!

Rashmika Mandanna: కన్నడలో బ్యాన్‌పై స్పందించిన రష్మిక, ఏమందో తెలుసా?

Rashmika Mandanna: కన్నడలో బ్యాన్‌పై స్పందించిన రష్మిక, ఏమందో తెలుసా?

టాప్ స్టోరీస్

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

JD Waiting For Party : విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

JD Waiting For Party :  విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?