Prabhas On Marriage News : తెలిసినప్పుడు చెబుతా - ఈసారి పెళ్ళిపై ప్రభాస్ ఏం చెప్పాడో చూశారా?
పెళ్ళి ప్రశ్నలను వీలైనంత వరకు అవాయిడ్ చేయాలని ప్రభాస్ చూశారు. కానీ, ఆయనను పెళ్ళి టాపిక్ వదల్లేదు. 'అన్‌స్టాపబుల్ - ద బాహుబలి ఎపిసోడ్' పార్ట్ 2లో కూడా కంటిన్యూ అయ్యింది. ప్రభాస్ ఏం చెప్పారో తెలుసా?
'మ్యారేజ్... మ్యారేజ్ క్వశ్చన్స్... ఐ డోంట్ లైక్! బట్, మ్యారేజ్ క్వశ్చన్స్ లైక్స్ మి, ఐ కాంట్ అవాయిడ్' - 'అన్‌స్టాపబుల్ 2 - ద బాహుబలి' ఎపిసోడ్‌లో ప్రభాస్ పరిస్థితి వివరించాడని ఈ డైలాగ్ కరెక్టుగా సరిపోతుందేమో!? పాపం... పెళ్ళి టాపిక్ అవాయిడ్ చేయాలని రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. రెండో పార్టులో కూడా మ్యారేజ్ మసాలా కంటిన్యూ అయ్యింది.
పెళ్ళి ఎప్పుడు ప్రభాస్?
ఫైనల్ ఆన్సర్ విన్నారా!?
'అన్‌స్టాపబుల్ 2 - ద బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 1లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోనులో మాట్లాడారు. ప్రభాస్ పెళ్ళి టాపిక్ వచ్చింది. సగం సగం చెప్పి వదిలేశారు. పార్ట్ 2లో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్ వచ్చారు. ఆయన దగ్గర కూడా బాలకృష్ణ పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చారు.
'రాణి ఎవరు? గుడ్ న్యూస్ అంటగా! ఇంటి పేరుతో సహా చెప్పు. సననా? శెట్టినా?' అని బాలకృష్ణ ప్రశ్నించారు. 'మోస్ట్ లీ నెక్స్ట్ ఇయర్ అనుకుంట సార్' అని గోపీచంద్ సమాధానం ఇచ్చారు. ఒక్కసారి ప్రభాస్ షాక్ తిన్నారు. 'నువ్వు, చరణ్ మాట్లాడుకుని వచ్చారా? మంచి న్యూస్ అంటే ఏంటిరా? రేపు సోషల్ మీడియాను తట్టుకోలేం సార్' అంటూ గోల చేశారు.
రహస్యంగా పెళ్ళి చేసుకున్న ప్రభాస్!?
ప్రభాస్ రహస్యంగా పెళ్ళి చేసుకున్నారని, ఎంతో మంది అమ్మాయిల మనసు ముక్కలు చేశారని రాసిన ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కూడా చూపించారు. అది ప్రభాస్ అంటూ బాలకృష్ణ, గోపీచంద్ అనడంతో... ''మా అమ్మ ఇటువంటివి చూసి కంగారు పడుతుంది'' అని ప్రభాస్ అన్నారు. అది మార్ఫింగ్ చేసిన ఫోటోతో షోలో సరదా కోసం చేసినది.
Also Read : గోపీచంద్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ
చివరకు పెళ్ళి టాపిక్‌కి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయమని బాలకృష్ణ అడిగారు. ''ఇది ఎక్కడ దారుణం సార్! అయిపొయింది టాపిక్ అని మళ్ళీ తీసుకొచ్చారు'' అని ప్రభాస్ సమాధానం ఇచ్చారు. ''ఈ ప్రోగ్రామ్ చూసి మీ ఇష్టం వచ్చినట్లు ఆర్టికల్స్ రాయొద్దు. ప్రభాస్ పెళ్లి న్యూస్ ప్రభాస్ చెబుతాడు. మీరు అతడిని చెప్పకండి. బాగోదు'' అంటూ బాలకృష్ణ కన్‌క్లూజన్ ఇచ్చారు. ''నాకు తెలిసినప్పుడు చెబుతా'' అంటూ ప్రభాస్ ముగింపు పలికారు. 'అన్‌స్టాపబుల్ 2 - ద బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 2లో సంగతులు ఇవి. జనవరి 6 నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?
భారతీయ చిత్రసీమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్, పెళ్ళి (Prabhas Marriage) కాని కథానాయకుల లిస్టు తీస్తే... అందులో బాహుబలి ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. అసలు, ఆయనకు చేసుకునే ఉద్దేశం ప్రభాస్ మదిలో ఉందా? లేదా? ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన హోస్ట్ చేస్తున్న, 'ఆహా' ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతున్న 'అన్‌స్టాపబుల్ 2'కు ప్రభాస్ వచ్చిన సంగతి తెలిసిందే. షో స్టార్టింగే బాలకృష్ణ పెళ్ళి టాపిక్ తీశారు.
పెళ్ళి చేసుకుంటాను కానీ...
'ఏంటి... పెళ్ళి ఉందా? లేదా?' అని బాలకృష్ణ డైరెక్టుగా అడిగారు. 'ఏమో సార్! ఇంకా తెలియదు' అని ప్రభాస్ చెప్పారు. అక్కడితో బాలయ్య ఆగలేదు. 'ఒంటరిగా ఫిక్స్ అయ్యావా?' అని మళ్ళీ అడిగారు. 'లేదు సార్! పెళ్ళి చేసుకుంటాను సార్! ఇంకా రాసి పెట్టి లేదేమో!?' అని ప్రభాస్ చెప్పారు.
''మన చేతుల్లో ఏముంటుంది? రాసి పెట్టి ఉండాలి. మీకు తెలుసు కదా!'' అంటూ... ఇంకా పెళ్ళి జరగకపోవడానికి కారణం తాను కాదన్నట్టు ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఆ విషయంలో బాలకృష్ణ ఏకీభవించలేదు. ''మన చేతుల్లోనే ఉందయ్యా బాబు! తాళి కట్టేది మనమే. మూడు ముళ్ళు చేతులతో వేయాలి'' అని బాలయ్య చెప్పారు. లేదంటే పురోహితుడు కడతాడా? ఏంటి? అంటూ చమత్కరించారు. 'ఏ ధైర్యంతో ఒంటరిగా మిగిలిపోవాలని ఫిక్స్ అయ్యావ్' అని బాలకృష్ణ అడిగితే... ''నేను ఫిక్స్ అవ్వలేదు సార్'' అని ప్రభాస్ చెప్పారు. 'మరి, అందరికీ చేసుకుంటా! చేసుకుంటానని చెబుతున్నావ్. క్లారిటీ ఇవ్వడం లేదు' అని మళ్ళీ అడిగితే... ''అవ్వుద్ది సార్! నాకూ క్లారిటీ లేదు సార్'' అని ప్రభాస్ చెప్పారు.