అన్వేషించండి

Balakrishna Gopichand : గోపీచంద్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ

Gopichand 30th film titled Rama Banam : గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి నట సింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ ఫిక్స్ చేశారు. 

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు సెంటిమెంట్లు ఎక్కువ. ఆయన ముహూర్తాలు, పేర్లు బాలలు చూస్తారు. యువ హీరో గోపీచంద్ (Gopichand Hero)కు కూడా ఓ విషయంలో సెంటిమెంట్ ఉంది. ఆయన సినిమా పేరు చివర 'అం' వచ్చిందంటే సినిమా సూపర్ హిట్టే.

'జయం', 'నిజం', 'వర్షం'... ప్రతినాయకుడిగా నటించిన మూడు సినిమాల్లో చివర 'అం' ఉంది. ఇక, కథానాయకుడిగా చేసిన సినిమాలకు వస్తే... 'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం', 'శంఖం', 'సాహసం', 'లౌక్యం', 'సౌఖ్యం', 'పంతం' సినిమాలు ఉన్నాయి. ఎక్కడో ఒకటి అరా తప్పిస్తే మిగతా సినిమాలు అన్నీ హిట్టే. ఆ సెంటిమెంట్ ప్రకారం గోపీచంద్ కొత్త సినిమాకు బాలకృష్ణ టైటిల్ పెట్టారు. 

రామ బాణం...
అక్షర బలం!
'అన్‌స్టాపబుల్‌ 2' టాక్ షోకు ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా వచ్చిన రెండో పార్ట్ ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గోపీచంద్ టైటిల్స్ గురించి చెబుతూ... 'లౌక్యం చేశావ్ కదా! ఏమైనా లౌక్యం నేర్చుకున్నావా?' అని తొలుత ప్రశ్నించారు. 'అంత తెలియలేదు సార్' అని గోపీచంద్ చెబితే... వెంటనే ప్రభాస్ 'సార్ లౌక్యం తెలిసే ఉంటుంది. లేదంటే ఇన్ని హిట్లు కొట్టి ఉండడు' అని అందుకున్నారు.
   
'నీకు టైటిల్ చివరలో సున్నా... నాకు మధ్యలో సున్నా... ఇదొక సెంటిమెంట్' అంటూ సినిమా పేర్లు అన్నీ బాలకృష్ణ చెప్పారు. ఆ తర్వాత 'నా షోకి వచ్చావ్ కదా! ఇప్పుడు నీ సినిమాకు నేను టైటిల్ పెడతా! ఓకేనా?' అని అడిగారు. 'మీరు చూస్తే మంచి ముహూర్తం చూసి పెడతారు సార్! అదిరిపోతుంది. పెట్టించేసుకో' అని ప్రభాస్ అన్నారు.
 
'అక్షర బలం కూడా ఉండాలయ్యా! ముహూర్తం ఉంటే సరిపోదు' అని చెప్పిన బాలకృష్ణ... 'రామ బాణం' (Rama Banam Movie) టైటిల్ సూచించారు. ఆ టైటిల్ చాలా బావుందని గోపీచంద్ అన్నారు. 'బాలయ్య పెట్టిన టైటిల్ అని చెప్పండి. ఇక దానికి ఎదురు ఉండదు' అని నట సింహం అన్నారు. వంద రోజుల వేడుకకు తాను ముఖ్య అతిథిగా వస్తానని కూడా మాట ఇచ్చారు. సో... గోపీచంద్ నెక్స్ట్ సినిమా టైటిల్ 'రామ బాణం' అని ఫిక్స్ అయిపోవచ్చు.

Also Read : బాలకృష్ణ సేఫ్ - ఒంగోలులో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏమైందంటే?
 

'లక్ష్యం', 'లౌక్యం' విజయాల తర్వాత గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. హ్యాట్రిక్ మీద కన్నేశారు. ఇది గోపీచంద్ 30వ సినిమా. 'కార్తికేయ 2', 'ధమాకా' విజయాలు అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రానికే నట సింహం బాలకృష్ణ 'రామ బాణం' టైటిల్ ఖరారు చేసింది. అన్నట్టు... ఆయన హీరోగా నటించిన 'డిక్టేటర్' సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు.

'అన్‌స్టాపబుల్‌ 2'కు ప్రభాస్ అతిథిగా వచ్చిన ఫస్ట్ పార్ట్ 'అన్‌స్టాపబుల్‌ 2 - ద బాహుబలి ఎపిసోడ్' పార్ట్ వన్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. రెండో పార్ట్ కూడా వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో కూడా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. హీరోయిన్స్ ఫోటోలు చూపించి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రభాస్ రెండు మూడు సార్లు సిగ్గు పడ్డారు. 

Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget