Prabhas New Look : మారుతి సినిమాలో ప్రభాస్ లుక్కు - రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త లుక్ చూసి అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఆయన మారుతి సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొత్త లుక్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పాలి. వాళ్ళంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 2' (Unstoppable Season 2) అందుకు కారణం అని చెప్పాలి. ఈ టాక్ షోకు ప్రభాస్, గోపీచంద్ వచ్చారు. వాళ్ళిద్దరి స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ కొత్తగా ఉన్నారు.
మారుతి సినిమాలో లుక్ ఇదే!
ప్రభాస్ ఇటీవల ఎక్కడికి వెళ్ళినా మంకీ క్యాప్ పెట్టుకుని కనబడుతున్నారు. ఆ స్టైల్ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వాటిని పక్కన పెడితే... లేటెస్టుగా షూట్ చేసిన 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌కు ఆయన మంకీ క్యాప్ లాంటిది లేకుండా వచ్చారు. హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది. ఈ లుక్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చింది. అసలు విషయం ఏంటంటే... మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో ప్రభాస్ ఈ లుక్‌లో కనిపిస్తారట.
కొత్త షెడ్యూల్ షురూ!
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి (Maruthi Director) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు కూడా. ట్విస్ట్ ఏంటంటే... ఫస్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్ లేరు. మిగతా ఆర్టిస్టుల మీద సీన్స్ తీశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... రెండో షెడ్యూల్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లో సోమవారం స్టార్ట్ చేసిన కొత్త షెడ్యూల్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. క్రిస్మస్ ముందు వరకు కీ సీన్స్ తీయాలని మారుతి ప్లాన్ చేశారట.
వీఎఫ్ఎక్స్ కోసమే 80 కోట్లు!?
ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి హారర్ జానర్ సినిమా చేస్తున్నారు. అందువల్ల, ఈ సినిమా ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ కాస్త టెన్షన్‌లో ఉన్నారు. మారుతి అంటే లో బడ్జెట్, లోకల్ నటీనటులతో చుట్టేస్తారేమోనని తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి భయాలు ఏం పెట్టుకొనవసరం లేదు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం రూ. 80 కోట్లు కేటాయించారని తెలిసింది. ఘోస్ట్ గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకూడదని చిత్ర బృందం డిసైడ్ అయ్యిందట. 'ఆదిపురుష్' వీఎఫ్ఎక్స్ విషయంలో వచ్చిన ట్రోల్స్ దృష్టిలో పెట్టుకుని, మళ్ళీ అటువంటి మిస్టేక్స్ చేయకూడదని నిర్ణయించారట. ప్రభాస్ కూడా వీఎఫ్ఎక్స్ విషయంలో కేర్ తీసుకోమని చెప్పారట.
Also Read : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!
ప్రభాస్, మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఓ కథానాయికగా నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మరో కథానాయికగా మాళవికా మోహనన్ (Malavika Mohanan) ను ఎప్పుడో ఎంపిక చేశారు. మూడో కథానాయికను కూడా ఈ మధ్య కన్ఫర్మ్ చేశారు.
రాజ్ తరుణ్ 'లవర్' సినిమాలో కథానాయికగా నటించిన రిద్ధీ కుమార్ (Riddhi Kumar) గుర్తు ఉన్నారా? ఈ సినిమాలో ఆవిడ ఛాన్స్ అనుకున్నారు. ప్రభాస్ లాస్ట్ సినిమా 'రాధే శ్యామ్'లో ఆవిడ ఓ చిన్న రోల్ చేశారు. ఇప్పుడు ఏకంగా మూడో హీరోయిన్ ఛాన్స్ అంటే పెద్ద అవకాశమే. ఇంతకు ముందు హిందీ సినిమా 'సలామ్ వెంకీ'లో ఆవిడ నటించారు.
మారుతి సినిమా, 'ఆదిపురుష్' కాకుండా 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న 'సలార్' ఒకటి... 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' ఒకటి... ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అవి పూర్తి అయిన తర్వాత 'స్పిరిట్' సెట్స్ మీదకు వెళుతుంది. 'స్పిరిట్' సినిమాకు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. అది కూడా పాన్ ఇండియా సినిమా.