అన్వేషించండి

Prabhas-Samantha: సమంతకు కాంపిటీషన్ గా మారిన ప్రభాస్ - 'యశోద' ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుతుందా?

ప్రభాస్ 'వర్షం' సినిమాను మరోసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద'(Yashoda) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్(Sridevi Movies) బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. నవంబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఆ సమయానికి పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. దీంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశించారు నిర్మాతలు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా ప్రభాస్ సినిమా రాబోతుంది. ఈ మధ్యకాలంలో సినిమాల రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరో పాత సినిమాలను మరోసారి థియేటర్లో చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. 

దీంతో మేకర్లు రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రభాస్ 'వర్షం' సినిమాను మరోసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 11నాటికి ప్రభాస్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇరవై ఏళ్లు అవుతున్న సందర్భంగా 'వర్షం' సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కచ్చితంగా 'యశోద' ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

'వర్షం' సినిమా బీ, సీ సెంటర్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. చాలా థియేటర్లలో ఆడియన్స్ కు 'యశోద' కంటే 'వర్షం' సినిమా ఫస్ట్ ఛాయిస్ అయ్యేలా ఉంది. ఏ సెంటర్స్, మల్టీప్లెక్స్ లలో మాత్రం 'యశోద' టికెట్స్ తెగడం ఖాయం. మొత్తానికి ప్రభాస్ 'వర్షం'.. సమంతకు కాంపిటీషన్ గా మారిందనే చెప్పాలి. మరి ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి!

ఇప్పటికే 'యశోద' డీల్స్ మొత్తం క్లోజ్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సినిమాస్ సంస్థ, దిల్ రాజు కలిసి రూ.10 కోట్లకు తీసుకున్నారు. కర్ణాటకలో సినిమాను హాట్ స్టార్ సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. 'కార్తికేయ2' సినిమాను బాలీవుడ్ లో విడుదల చేసిన సంస్థ హిందీ వెర్షన్ హక్కులను దక్కించుకుంది. అమెజాన్ ప్రతినిధులు సినిమా చూసి రూ.22 కోట్లకు అన్ని భాషలకు చెందిన డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ హక్కులు రెండు కోట్ల మేరకు అమ్ముడైనట్లు సమాచారం. శాటిలైట్ హక్కుల కోసం కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న 'యశోద' సినిమాలో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు.  

Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget