Prabhas: ‘డ్రామాలొద్దు.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా? ఆమె బాత్రూమ్‌లో నేనెందుకు?: ప్రభాస్ వ్యాఖ్యలు
పూరీ తనయుడు ఆకాశ్ పూరీ నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్.. ఆకాశ్ పూరీ, కేతిక శర్మలను ఇంటర్వ్యూ చేశాడు.
రెబల్ స్టార్ ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశంలో అభిమానులు ఉన్నారు. అయితే, ప్రభాస్ మీడియాకు, సోషల్ మీడియాకూ చాలా దూరంగా ఉంటారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. తన కోసం తనకే సమయం కేటాయించుకోలేని పరిస్థితి. అలాంటిది పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటించిన ‘రొమాంటిక్’ సినిమా కోసం స్వయంగా రంగంలోకి దిగాడు మన బాహుబలి. ఎన్నడూలేని విధంగా.. ఆ సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రభాస్.. ‘రొమాంటిక్’ ట్రైలర్‌ను విడుదల చేయడమే కాదు.. ఆ చిత్రం హీరో, హీరోయిన్లు ఆకాశ్, కేతిక శర్మలను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా వారిపై సైటర్లు పేలుస్తూ.. సరదాగా మాట్లాడాడు ప్రభాస్. ఫన్నీ ప్రశ్నలతో ఆకాశ్, కేతికలను ముప్పుతిప్పలు పెట్టడమే కాదు.. మధ్య మధ్యలో వారికి స్వీట్ వార్నింగ్స్ కూడా ఇచ్చాడు.
ఇంటర్వ్యూలో భాగంగా.. ప్రభాస్ సరదాగా ఆ అమ్మాయి ఎవరూ, పేరు మరిచిపోయాను అన్నట్లుగా మాట్లాడాడు. దీంతో కేతిక తనని తాను పరిచయం చేసుకుంటూ.. ‘‘హాయ్ సార్, నేను ఢిల్లీ నుంచి వచ్చాను. నా పేరు కేతిక’ అని చెప్పింది. ఆ వెంటనే ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘హాయ్ మేడం, నేను ప్రభాస్.. మాది మొగల్తూరు అని సమాధానం ఇచ్చాడు.
ఆకాశ్ మాట్లాడుతూ.. కేతిక చాలా బాగా పాడుతుందని చెప్పాడు. దీంతో కేతిక.. ‘‘లేదు సార్ నేను.. కేవలం బాత్రూమ్ సింగర్’’ అని చెప్పింది. దీంతో ఆకాశ్.. ఇదే బాత్రూమ్ అనుకో. నేను.. ప్రభాస్ ఇక్కడ లేమనుకో. ఏమంటావ్ డార్లింగ్’’ అని అడిగాడు. ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘ఆమె బాత్రూమ్‌లో నేను ఎందుకు ఉంటాను?’’ అని సెటైర్ పేల్చాడు.
సినిమా షూటింగ్ మొత్తం గోవాలో జరిగింది కదా.. అక్కడ మీరు ఏమేమి చూశారో చెప్పండని ప్రభాస్ అడిగాడు. ఇందుకు ఆకాశ్, కేతిక సమాధానమిస్తూ.. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఏమీ చూడలేకపోయామని అన్నారు. గోవా ఫుడ్ గురించి మాట్లాడుతూ ఆకాశ్ అక్కడి ఏ హోటల్‌లో నాన్-వేజ్ ఫుడ్ బాగుంటుందనే విషయాన్ని ప్రభాస్‌కు చెప్పాడు. దీంతో ప్రభాస్.. ‘‘డ్రామాలు దొబ్బకండి. ఇంతకు ముందు అడిగితే షూటింగ్‌కే పరిమితం అయ్యాం. ఖాళీ లేదు అని అన్నారుగా.. ఇప్పుడేంటీ ఇవన్నీ చెబుతున్నారు? పిచ్చోడిలా కనిపిస్తున్నానా?’’ అంటూ సరదాగా సీరియస్ అయ్యారు ప్రభాస్. పూరీ జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ నెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్లకు మాంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఒక రోజు ఆగాల్సిందే.
Also Read: 'మీ అమ్మాయి పెళ్లికోసం డబ్బు దాచకండి' సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
Also Read: ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Also Read: ప్రీతమ్‌తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి