(Source: ECI/ABP News/ABP Majha)
Prabhas : ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ కోసం బ్యాంగ్ రెడీ - ప్రభాస్
అభిమానులకు ప్రభాస్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. త్రీడీలో 'ఆదిపురుష్' టీజర్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని, వాళ్ళ కోసం కొన్ని వారాల్లో బ్యాంగ్ రెడీ చేశామని ఆయన తెలిపారు.
'ఆదిపురుష్' టీజర్ (Adipurush Teaser) ను త్రీడీలో చూసిన తర్వాత అభిమానులు ఏం ఫీలవుతారో తెలుసుకోవాలని ఉందని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వ్యాఖ్యానించారు. ఆయన శ్రీరాముని పాత్రలో నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ మధ్య సినిమా టీజర్ విడుదల చేశారు. గురువారం ఆ టీజర్‌ను హైదరాబాద్‌లో మీడియా కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. విలేకరుల నుంచి రివ్యూ కోరిన ప్రభాస్, అభిమానులు త్రీడీలో చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రభాస్ అభిమానుల కోసం...
తెలుగు రాష్ట్రాల్లో 60 థియేటర్లలో!
Prabhas Speech At Adipurush 3D Screening, Hyderabad : ''అభిమానుల కోసం 60 థియేటర్లలో 'ఆదిపురుష్' టీజర్‌ను త్రీడీలో ప్రదర్శిస్తున్నాం. ఎందుకంటే... వాళ్ళే మాకు సపోర్ట్! వాళ్ళు ఫస్ట్ చూడాలి. వాళ్ళు ఏం ఫీలవుతున్నారనేది తెలుసుకోవాలి'' అని ప్రభాస్ చెప్పారు. ఫ్యాన్స్ అందరూ థియేటర్లలో టీజర్ చూసి ఎంజాయ్ చేస్తారన్నారు. అంతే కాదు... కొన్ని వారాల్లో మరో అద్భుతమైన కంటెంట్‌తో వస్తామని ఆయన తెలిపారు.
త్రీడీలో చూసి చిన్న పిల్లాడ్ని అయ్యా - ప్రభాస్!
''ఫస్ట్ టైమ్ త్రీడీలో 'ఆదిపురుష్' టీజర్ చూసినప్పుడు నేను అయితే చిన్న పిల్లాడ్ని అయిపోయా. నాకు అది గొప్ప అనుభూతి. విజువల్స్, యానిమల్స్ ముఖం మీదకు రావడం చూసి థ్రిల్ అయ్యాను'' అని ప్రభాస్ తెలిపారు. ఇటువంటి టెక్నాలజీతో సినిమా తీయడం ఇండియాలో ఫస్ట్ టైమ్ అని ఆయన అన్నారు. ఇటువంటిది ఎప్పుడూ చేయలేదని, బిగ్ స్క్రీన్ కోసం సినిమా తీశామన్నారు. అందరూ త్రీడీలో చూడాలని ఆయన కోరారు.
తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం, ఆదరణ కావాలని 'ఆదిపురుష్' చిత్ర దర్శకుడు ఓం రౌత్ మాట్లాడారు. వెండితెర కోసం తీసిన సినిమా 'ఆదిపురుష్' అని ఆయన తెలిపారు. తెలుగు తనకు కొంచెం కొంచెం అర్థం అవుతుందని, కానీ మాట్లాడలేనని అన్నారు. తాను చెప్పాలనుకున్న విషయాలను 'దిల్' రాజు చెప్పేశారన్నారు. ఇక, నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ ''త్రీడీ టీజర్‌కు వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. సినిమాను సైతం త్రీడీలో విడుదల చేస్తాం. ప్రభాస్ నటన, ఓం రౌత్ దర్శకత్వం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి'' అని అన్నారు.
'ఆదిపురుష్' టీజర్‌పై ట్రోల్స్, మీమ్స్ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం దేశ వ్యాప్తంగా త్రీడీలో చూపించడం మొదలు పెట్టింది. నిజం చెప్పాలంటే... యూట్యూబ్‌లో చూసిన దానికి, బిగ్ స్క్రీన్ మీద త్రీడీలో చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంది. విజువల్ వండర్ అని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు చేస్తున్నారు.
'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారని సమాచారం.