News
News
X

Om Raut on Adipurush Trolls : మొబైల్స్‌లో చూస్తే? - 'ఆదిపురుష్' టీజర్ ట్రోల్స్, మీమ్స్‌పై దర్శకుడు ఓం రౌత్ రియాక్షన్

Director Om Raut Reacts On Adipurush Teaser Trolls : 'ఆదిపురుష్' టీజర్‌పై వస్తున్న ట్రోల్స్ మీద దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. మీమ్స్, ట్రోల్స్ చూసి తాను ఆశ్చర్యపోలేదని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే

FOLLOW US: 
 
'ఆదిపురుష్' టీజర్ (Adipurush) విడుదలకు ముందు వరకు సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, ఆ తర్వాత 'సాహో', 'రాధే శ్యామ్' చిత్రాలు చేశారు. అయితే... ఆ రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దాంతో 'ఆదిపురుష్' మీద ప్రభాస్ (Prabhas) అభిమానులు, ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. 

అంచనాల మాట సంగతి దేవుడు ఎరుగు... 'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రభాస్ (Prabhas) అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. సగటు సినిమా ప్రేక్షకులు కూడా టీజర్ బాలేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కార్టూన్ సినిమాలా ఉందని పేర్కొంటున్నారు. రామాయణం నేపథ్యంలో 'ఆదిపురుష్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. రామ భక్తులు, హిందూత్వ వాదుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.
 
వెండితెరపై చూడాలి...
మొబైల్స్‌లో కాదు!
'ఆదిపురుష్' టీజర్‌పై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ మీద చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. ''బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియ‌న్స్‌ కోసం సినిమా తీశాం. ప్రేక్షకుల ఆనందం కోసం సినిమా టీజర్ యూట్యూబ్‌లో విడుదల చేశాం. మొబైల్ ఫోనులో టీజర్ చూస్తే కొంత భిన్నంగా ఉంటుంది. మీమ్స్, ట్రోల్స్ నన్ను స‌ర్‌ప్రైజ్‌ చేయలేదు. అయితే... తొలుత ఆ విమర్శలు చూసి కొంత ధైర్యం కోల్పోయిన మాట వాస్తవమే. మా చిత్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్‌కు యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రపంచంలో అతి పెద్ద యూట్యూబ్ ఛానల్ అది. దాని కోసం మేం సినిమా తీయలేదు. థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు మాత్రమే కాదు... మారుమూల గ్రామాల ప్రజలను సైతం థియేటర్లకు రప్పించడానికి సినిమా తీశాం'' అని ఓం రౌత్ పేర్కొన్నారు.  

Prabhas Fires On Om Raut? : 'ఆదిపురుష్' టీజర్ చూశాక... ప్రభాస్ సైతం దర్శకుడు ఓం రౌత్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారని గుసగుస. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అయోధ్యలో 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ ప్రోగ్రామ్‌కు ప్రభాస్ ఏ డ్రస్‌లో అయితే హాజరు అయ్యారో, ఆ వీడియోలో అదే డ్రస్‌లో ఉన్నారు. ''ఓం... నువ్వు నా రూమ్‌కు వస్తున్నావ్'' అని ప్రభాస్ పిలిచారు. అంతే కాదు, ఆ తర్వాత 'ఓం... నువ్వు రా'' అన్నట్లు సైగలు చేశారు. వీడియోలో కనిపించలేదు కానీ... ''నేను వస్తున్నాను'' అని ఓం రౌత్ చెప్పడం వినిపించింది. 

News Reels

'ఆదిపురుష్' టీజర్ చూశాక... రూమ్‌కు పిలిపించుకుని మరీ ఓం రౌత్‌కు ప్రభాస్ క్లాస్ పీకారని ఆ వీడియో చూసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ నిజంగా ఏమన్నారో తెలియదు గానీ... ఈ గాసిప్ వైరల్ అవుతోంది. 

Also Read : Godfather Box Office : 'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?

View this post on Instagram
 
A post shared by ABP Desam (@abpdesam)

'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. 

Also Read : RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Published at : 06 Oct 2022 12:45 PM (IST) Tags: Prabhas Adipurush teaser trolls Om Raut on Adipurush Trolls Om Raut Reacts To Trolls

సంబంధిత కథనాలు

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్  శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Urvasivo Rakshasivo OTT Release : ఆహా ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో' - రిలీజ్ ఎప్పుడంటే?

Urvasivo Rakshasivo OTT Release : ఆహా ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో' - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Manchu Lakshmi Vs Ysrcp : జగన్‌ను ట్రోల్ చేసిన మంచు లక్ష్మి - ఇక వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ ఊరుకుంటారా?

Manchu Lakshmi Vs Ysrcp :  జగన్‌ను ట్రోల్ చేసిన మంచు లక్ష్మి - ఇక వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ ఊరుకుంటారా?

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!