Prabhas: కన్నీటిపర్యంతమైన ప్రభాస్ - తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!
ప్రభాస్ తన పెదనాన్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉదయం 3.25 గంటలకు ఆయన చనిపోయినట్లుగా ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు కృష్ణంరాజు ఇంటికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. ప్రభాస్ అయితే తన పెదనాన్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాసేపటి క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కృష్ణంరాజుకి నివాళులు అర్పించి ప్రభాస్ ని పరామర్శించగా.. ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో మంత్రి తలసాని.. ప్రభాస్ ని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ప్రభాస్ ని స్ట్రాంగ్ గా ఉండమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
😭😭😭😭 pic.twitter.com/fN4yVQgvqT
— Team PRABHAS (@TeamPrabhasOffl) September 11, 2022
కృష్ణం రాజు కడసారి చూసిన ప్రభాస్:
కృష్ణం రాజు (Krishnam Raju) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం చేర్పించారు. చికిత్స తీసుకుంటున్న ఆయన్ను చూడటానికి ప్రభాస్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. పెదనాన్నను కడసారి చివరి చూపు చూసుకున్నారు. ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లాడని తెలిసిన ఫ్యాన్స్‌కు టెన్షన్ మొదలైంది. తొలుత ఆయనకు ఏమైందని ఆందోళన చెందారు. ఆ తర్వాత కృష్ణం రాజుకు బాలేదని తెలిసిన తర్వాత మరో టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
వయోభారంతో కృష్ణం రాజుకు ఆరోగ్య సమస్యలు:
కృష్ణం రాజు వయసు 83 ఏళ్ళు. వయోభారం వల్ల వచ్చిన అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల నుంచి ఆయనకు సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా సమయంలో కూడా రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు కూడా వచ్చాయి.
విజయనగర సామ్రాజ్య రాజవంశస్తులు:
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆయనకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించారు. 1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 1986 లో తాండ్ర పాపారాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
రాధే శ్యామ్ చివరి సినిమా:
'రాధే శ్యామ్'లో తన తమ్ముడు సూర్యనారాయణ రాజు కుమారుడు ప్రభాస్‌తో కలిసి కృష్ణం రాజు నటించారు. ఆ సినిమాలో కూడా కేవలం ప్రభాస్ కోసమే నటించారు. నటుడిగా ఆయన చివరి సినిమా 'రాధే శ్యామ్'.
Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!
Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్